రెండు సార్లు కులగణన చేసి చట్టం ఆర్డినెన్సు దిల్లీలో ధర్నా అని రైలు ఎక్కించి తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు.సోనియా రాహుల్ ఖర్గే ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శమని ప్రచారం చేసుకున్నారని తలసాని గుర్తు చేశారు. అయితే ఇచ్చిన రిజర్వేషన్లలో కేవలం పదిహేడు పాయింట్ జీరో ఎనిమిది ఏడు శాతం మాత్రమే బీసీలకు దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో బీసీ జనాభాను జీరోగా చూపించి రిజర్వేషన్లు లాగేశారని ఆయన ఆరోపించారు.
కామారెడ్డి డిక్లరేషన్ సమయంలో నూట ఇరవై ఐదు ఏళ్ల చరిత్ర ఉందని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ఇప్పుడు బీసీల గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీ సమాజానికి ప్రభుత్వం ఉరి తాడు వేసిందని తలసాని ఘాటుగా విమర్శించారు. బీసీ సంఘాలను కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాత్రం ఈ అన్యాయాన్ని చూసి కనీసం స్పందన కనబరచడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు పార్టీలూ బీసీలను రాజకీయ బలిపశువులుగా మార్చాయని ఆర్శించారు.బీసీ సమాజం ఇక పై మోసపోదని పరిణతి చెందిందని తలసాని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలనూ బీసీలు బొంద పెడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విమర్శలు రాష్ట్ర రాజకీయ వాతావరణంలో కొత్త చర్చను రేకెత్తిస్తున్నాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి