ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎలాంటి పర్యావరణ అధ్యయనం చేసిందని ఏలేటి ప్రశ్నించారు. ఈ పాలసీకి సంబంధించి ఒక్క కమిటీ కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వ్యాపార సంస్థలా నడిపిస్తున్నారని, భవిష్యత్తు తరాలకు భూములు మిగలకుండా సర్వనాశనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు పరిశ్రమల కోసం కేటాయించినవి కాగా, ఇప్పుడు వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగిస్తున్నారని ఆరోపణ.
కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లకు వేలం పడితే రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం వచ్చింది. అదే విధానం ఇక్కడ అమలు చేస్తే ఎందుకు సాధ్యం కాదని ఏలేటి సూటిగా ప్రశ్నించారు. బదులుగా తక్కువ ధరలకు భూములు ఇవ్వడం వెనుక ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఉందని ఆయన ఆరోపించారు. ఈ పాలసీ ద్వారా కొందరు సన్నిహితులు లక్షల కోట్లు సంపాదిస్తారని, రాష్ట్రం మాత్రం నష్టపోతుందని హెచ్చరించారు.
ఈ విషయంపై బీజేపీ తీవ్రంగా పోరాడుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జీవో 27ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే రచ్చబండ నడపడం ఖాయమని హెచ్చరించారు. ఈ ఆరోపణలతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి