ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫార్మా ఐటీ ఎయిరోస్పేస్ లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు దృష్టి పెట్టారు. రాష్ట్రం 40 శాతం జెనరిక్స్ ఎగుమతుల్లో ఆధిపత్యం చెలాయిస్తోందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సమ్మిట్ మెయిన్ హైలైట్ డిసెంబర్ 9న విడుదలయ్యే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చే రోడ్‌మ్యాప్‌ను వివరిస్తుంది.
మాన్యుఫాక్చరింగ్ ఐటీ ఎమర్జింగ్ టెక్ లైఫ్ సైన్సెస్ ఎయిరోస్పేస్ ఈవీల్లో పెట్టుబడులు ఉద్యోగాలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్‌లు గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌లు ప్రధాన లక్ష్యాలు. రేవంత్ రెడ్డి ఈ డాక్యుమెంట్‌ను పాలసీ బైబిల్ మరియు యాక్షన్ లెడ్జర్‌గా వర్ణించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ డిసెంబర్ 8 మధ్యాహ్నం సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. యూనియన్ మంత్రి జి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వంటి ప్రముఖులు పాల్గొంటారు. సినిమా రంగంలో ఎస్ఎస్ రాజమౌళి, దేశ్‌ముఖ్ సుకుమార్, గునీత్ మోంగా, అనుపమ చోప్రా మాట్లాడతారు.
ప్రజలు ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని ఆశిస్తున్నారు.సమ్మిట్ బ్లాక్‌బస్టర్ అవుతుందా లేక అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోతుందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. ప్రభుత్వం 3 ట్రిలియన్ ఎకానమీ విజన్‌తో పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని చెబుతోంది. అయితే విపక్షాలు ఈ ఈవెంట్ ప్రజా డబ్బును వృథా చేస్తుందని విమర్శిస్తున్నాయి. ఆరు గ్యారంటీలు అమలు కాకపోవడం అప్పులు పెరగడం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి షోలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి