ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉందంటూ.. అధికారులు, ప్ర‌భుత్వం కూడా చెబుతున్న నేప‌థ్యంలో అస‌లు నిజంగా నే ప్ర‌జ‌లు అసంతృప్తిలో ఉన్నారా?  అనేది కీల‌క అంశం. వాస్త‌వానికి ఎక్క‌డైనా ప్ర‌భుత్వాలు.. ప్ర‌జ‌లు అసంతృప్తిలో ఉన్నార‌ని ఒప్పుకొనేందుకు సాహ‌సించ‌వు. ప్ర‌త్య‌ర్థులు ప్ర‌చారం చేసినా.. తిప్పికొట్టేందుకు ప్రాధాన్యం ఇస్తాయి. దీనిని వ్య‌తిరేక ప్ర‌చారంగానే చూస్తాయి. అలాంటిది.. రాష్ట్ర స‌ర్కారే ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ని చెబుతుండ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.


తాజాగా జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు నుంచి రెవెన్యూ, హోం శాఖ‌ల కార్య‌ద‌ర్శుల వ‌ర కు.. ప్రజ‌ల సంతృప్తి - అసంతృప్తి లెక్క‌లు చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌లు అసంతృప్తిలో ఉన్నార‌ని సీఎం చంద్ర బాబు వెల్ల‌డించారు. ఏకంగా త‌న‌పైనే అసంతృప్తి ఉంద‌న్నారు. వాస్త‌వానికి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఏడాది న్నర‌లోనే స‌ర్కారు అనేక రూపాల్లో ప్ర‌జ‌ల సంతృప్త స్థాయిలు తెలుసుకుంది. ఐవీఆర్ ఎస్ స‌ర్వే, పార్టీ ప‌రంగా కూడా చేసిన ప్ర‌య‌త్నాల్లో ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.


ఇది అత్యంత కీల‌కం కూడా. ప్ర‌భుత్వం త‌న త‌ప్పులు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ద్వారా.. వాటిని స‌రిచేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు త‌ర‌చుగానిర్వ‌హిస్తున్న స‌ర్వేల ద్వారా ప్ర‌జ‌ల సంతృప్తి, అసంతృప్తి లెక్క‌లు చెబుతున్నారు. ఇక‌, తాజాగా చంద్ర‌బాబు, అధికారులు చెప్పిన‌ట్టు నిజంగానే ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉందా? అంటే.. వాస్త‌వానికి కొన్ని విష‌యాల్లో త‌ప్ప‌.. పెద్ద‌గా లేద‌నేది ప‌బ్లిక్ టాక్‌. చేసింది చెప్పుకోవ‌డం, చేయాల‌ని అనుకున్న వాటిని ముందుగానే ప్ర‌ణాళిక‌లు వేసుకోవ‌డం.. చంద్ర‌బాబు స‌ర్కారు గొప్ప ల‌క్ష‌ణం.


సో.. ఆ దిశ‌గా ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉన్న విభాగాల‌ను ప‌ట్టించుకుని ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర యత్నం చేస్తే.. ఇబ్బందులు లేవ‌ని మేధావులు సూచిస్తున్నారు. ప్ర‌తి విష‌యాన్నీ ప‌ట్టించుకోక‌పోయినా.. కీల‌క అంశాల‌పై దృష్టి పెట్టాల‌ని సూచిస్తున్నారు. ఈ దిశ‌గా ప్ర‌భుత్వం మ‌రో ఆరు మాసాలు శ్ర‌ద్ధ తీసుకుంటే.. అసంతృప్తి త‌గ్గుతుంద‌ని అంటున్నారు. ఇప్పుడు అధికారుల‌పై బాధ్య‌త‌లు వ‌దిలేయడం క‌న్నా.. ముఖ్య‌మంత్రి స్వ‌యంగా రంగంలోకి దిగడం ద్వారా.. ప్ర‌జ‌ల అసంతృప్తిని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: