ప్రభుత్వం ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలని, గవర్నెన్స్ డెలివరీ స్పీడ్ పెంచాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా భూమి రికార్డులు పారదర్శకంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ విధంగా సీఎం ఆగ్రహం ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచడానికి దోహదపడుతోంది.పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీని వేగవంతం చేయాలని సీఎం పదేపదే ఆదేశిస్తున్నారు.
భూమి రికార్డులు ట్యాంపర్ చేయకుండా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పాటు క్యూ ఆర్ కోడ్‌లు జోడించి పాస్‌బుక్‌లను మరింత సురక్షితంగా తయారు చేస్తున్నారు. ఇది భూమి వివాదాలను తగ్గించి రైతులకు నమ్మకం కలిగిస్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను సూచిస్తూ భూమి హక్కుల పత్రాలపై అనవసర ఫోటోలు ముద్రించడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని విమర్శించారు.
ప్రస్తుతం రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో పాస్‌బుక్‌లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 22 లక్షల పాస్‌బుక్‌లు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం రైతులకు నూతన సంవత్సర కానుకలా ఉందని సీఎం వర్ణించారు.రీసర్వే పనులు వేగంగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటివరకు 6,680 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. మిగిలిన గ్రామాల్లో కూడా త్వరలో పూర్తి చేసి భూమి రికార్డులను డిజిటల్‌గా అప్‌డేట్ చేస్తామని హామీ ఇచ్చారు.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి