తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు.. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సుమారు 45 వేలు, సంస్థల్లో 20 వేలు భర్తీ చేయాల్సి ఉందని ముఖ్య కార్యదర్శులు ప్రభుత్వానికి నివే ధికను అందించారు..ఇందులో నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలు ఉన్నట్టు తెలిపారు. ఒప్పంద మరియు పొరుగు సేవల ఉద్యోగుల సంఖ్యను విడిగా పొందుపరిచారు.ఒకటి, రెండురోజుల్లో కచ్చితమైన సంఖ్యపై స్పష్టత వచ్చే వీలుందని సమాచారం..