డీఆర్‌డీఓ, డీఆర్‌డీఈ ఇవి రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ప్రతిష్టాత్మకమైన భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థలు. డీఆర్‌డీఓ, డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఆర్‌డీఈ) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.


మొత్తం ఖాళీలు 10 ఉన్నాయి. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)-08, రిసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ)-02 ఉన్నాయని ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్‌/ గేట్‌ ఉండాలి.

 

దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు జేఆర్‌ఎఫ్‌ వారికి 28 ఏళ్లు, ఆర్‌ఏ వారికి 35 ఏళ్లు మించకూడదు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ.. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (నవంబరు 15-22)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు చేసుకోవాలి.

మరిన్ని వివరాల కోసం https://www.drdo.gov.in/ వెబ్ సైట్ చూడొచ్చు. ఈ ఉద్యోగ సంస్థల చిరునామా: డీఆర్‌డీఈ, ఝాన్సీ రోడ్‌, గ్వాలియర్‌-474002.

మరింత సమాచారం తెలుసుకోండి: