దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి విద్యా వ్యవస్థలు అన్నీ బంద్ చెశారు.  ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు సైతం పోస్ట్ పోన్ చేశారు.  ఫిబ్రవరి నుంచి కరోనా మొదలైనప్పటికీ దీని ప్రభావం మార్చిలో ఎక్కువ కావడంతో కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేయడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థలు పూర్తిగా బంద్ అయ్యాయి. కొన్ని చోట్ల ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నారు.  అయితే తెలుగు రాష్ట్రాల్లో అప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి.. ఇక మిగిలింది పదవ తరగతి పరీక్షలు.  ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు మొదలైనప్పటి నుంచి విద్యా వ్యవస్థపై పునరాలోచనలు చేస్తున్నారు. 

 

ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పదో తరగతి విద్యార్థులు 11 పేపర్లు రాయాల్సి ఉంటుంది. కానీ ఏపీ సర్కార్ ఆ పేపర్లకు ఆరు పేపర్లకు కుదించింది. కరోనా ప్రభావం వల్ల పేపర్ 1, పేపర్ 2 బదులు ఒకే పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం జులై 10 నుంచి జులై 15 వరకు పరీక్షలు నిర్వహించనుంది. 
 
ఫలితాలను అదే నెలలో లేదా ఆగష్టు నెల తొలి వారంలో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జులై 10వ తేదీన తెలుగు, జులై 11వ తేదీన హిందీ, జులై 12వ తేదీన ఇంగ్లీష్, జులై 13వ తేదీన మ్యాథ్స్ , జులై 14వ తేదీన సైన్స్, జులై 15వ తేదీన సోషల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: