ప్రస్తుతం జాబ్ లేక ఎంతోమంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ అంటూ  ప్రిపేర్ అవుతున్నారు. ఎలాగైనా సరే ఈసారి జాబ్ కొట్టాలనే  నేపథ్యంతో పట్టువదలని విక్రమార్కుడిలా వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుత కాలంలో కొద్దో గొప్పో నోటిఫికేషన్లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఏకంగా కేంద్ర నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. అదే యూపీఎస్సీ లో ఉద్యోగాల భర్తీకి పిలుపునిస్తోంది కేంద్రం.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. భారీ వేతనాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి నిరుద్యోగులకు పిలుపునిస్తోంది. మొత్తం 57 కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.అయితే 2021 జనవరి 28వ తేదీ లోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

దరఖాస్తు చివరితేదీ: 2021 జనవరి 28
ఖాళీల వివరాలు:
1.అసిస్టెంట్ డైరెక్టర్ (షిప్పింగ్‌) 1,
2.అసిస్టెంట్ డైరెక్టర్ (బాలిస్టిక్స్‌) 1
3.స్పెషలిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెసర్  55 ఖాళీలు

వయోపరిమితి:
2021 జనవరి 28 నాటికి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
విద్యార్హత:
పీజీ ఉత్తీర్ణులై మూడు సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ డైరెక్టర్ డిగ్రీతో 3 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.అయితే ఈ ఉద్యోగానికి 35 సంవత్సరాల లోపు వయసు మాత్రమే ఉండాలి.
మాస్టర్ డిగ్రీ పాస్ కావడంతోపాటు ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
 25 రూపాయలు
నోటిఫికేషన్ లింక్:
https://www.upsc.gov.in/
పైన తెలిపిన వివరాల ద్వారా మీరు ఏ పోస్టుకు  సరైన వారో  తెలుసుకొని,ఆ పోస్టులకు అప్లై చేసుకోవాల్సిందిగా కేంద్రం కోరుతోంది. ఇక వేతనం విషయానికొస్తే ఈ ఉద్యోగానికి ఎంపికైన వారి విద్యార్హత, అనుభవం ఆధారంగా వేతనాలు నిర్ణయించబడతాయి.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం

మరింత సమాచారం తెలుసుకోండి: