ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లలో చేర్పిస్తున్నారు. ఫీజులు ఎంతైనా కూడా భరిస్తూ మరి ప్రైవేట్ స్కూల్స్ లలో చవిదిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు వేల కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా కూడా ఉద్యోగస్తులు ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఎంతగా కొత్త పథకాలను తీసుకొచ్చిన కూడా అటు వైపే వెళ్లడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పాఠశాల విద్యపై రూ.10వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని, డిమాండ్‌ మేరకు ఇంగ్లిషు మీడియం పాఠశాలలు ప్రారంభించినా ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోనే చదివిస్తున్నారని పీఆర్సీ నివేదిక ప్రస్తావించింది.



ఉద్యోగులు వీటిని వినియోగించుకోక పోవడంతో ప్రభుత్వ విద్యపై ఇతరుల్లోనూ మంచి అభిప్రాయం ఉండటం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో అట్టడడుగు కుటుంబాలు ఇబ్బందులను ఎదర్కొంటున్నారని వెల్లడించారు.1980లో యూకేలోనూ ఇలాంటి పరిస్థితే ఉండేదని, అక్కడ అమలు చేసిన సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిందని సర్కార్ గుర్తు చేసింది. అలాగే ఇటీవల ఢిల్లీ లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రవేశాలు పెరిగాయని తెలిపింది.



ఇలాంటి పరిస్థితే తెలంగాణలోనూ రావాలని, ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను సర్కారు స్కూళ్లలోనే చదివించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటిదాకా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే పిల్లలకు ఏడాదికి ఇచ్చే ట్యూషన్‌ ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.12వేలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశారు. దాన్ని పూర్తిగా తొలగించాలని పీఆర్సీ సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిస్తే ఏడాదికి రూ.2వేల రాయితీని వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న పథకాల కారణంగా చాలా మంది సర్కార్ పాఠశాలలో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల వల్ల విద్యార్థులకు లభించే వాటి పై అధికారులు వారి తల్లి దండ్రులకు అవగాహన కల్పిస్తే ఈ ఏడాది సర్కారు పాఠశాలలో చేరిక పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: