కరోనా ఎఫెక్ట్.. బంగారం ధరలు ఎలా పెరుగుతున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు బంగారం ధరలు భారీగా పెరిగితే మరో రోజు బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరుగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎంత ఉంటాయి అనేది చూడాలి. 

 

వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 42.940 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 39,360 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 20 రూపాయిల తగ్గుదలతో 47,830 రూపాయిలకు చేరుకుంది. 

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారం, వెండిపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: