నేడు బంగారం ధరలు భారీగా పడిపోయి మగువలకు ఊరటనిచ్చాయి. గరిష్టంగా బంగారం ధర రూ. 650కి పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,400, . 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,350, కేజీ వెండి ధర రూ.65,900.

పసిడికి ఇండియాలో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  అయితే బంగారాన్ని సాంప్రదాయ వేడుకలకు, లేదా ఆభరణాలుగా ధరించడానికి మాత్రమే కాకుండా పెట్టుబడి రూపంలో కూడా పెడుతున్నారు. తద్వారా డబ్బును వెనకేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో పలు గోల్డ్ పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. నిన్న వాటికీ సంబంధించిన స్పాట్ గోల్డ్, గోల్డ్ ఫ్యూచర్స్ అంటే ఏంటి అనే విషయాలను తెలుసుకున్నాము. ఇప్పుడు వాటి మధ్య తేడా ఏంటి? ఏది బెటర్ అనే విషయాలను తెలుసుకుందాం.

గోల్డ్ ఫ్యూచర్స్‌లో మీరు చూసే ధర సెటిల్‌మెంట్ ధర. ఇది కొనుగోలుదారులు, విక్రేతలు గోల్డ్ ఫ్యూచర్స్ ఒప్పందాలను కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి అంగీకరించే ధర. గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు స్పాట్ గోల్డ్ మార్కెట్ ధరపై ఆధారపడి ఉంటాయి. స్పాట్ గోల్డ్, గోల్డ్ ఫ్యూచర్స్ రెండింటికీ మార్జిన్ అవసరాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ అక్కడే కొంత వ్యత్యాసం ఉంటుంది. స్పాట్ గోల్డ్ మార్కెట్‌ల స్థానాన్ని చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఇది ట్రేడ్ చేయడానికి కనీస పరిమాణం. స్పాట్ గోల్డ్ 1: 100 నిష్పత్తిని కలిగి ఉంది. మార్కెట్ డీలర్లు స్పాట్ బంగారంతో వ్యవహరించే తీరు కారణంగా పెట్టుబడిదారులు ఏ క్షణంలోనైనా కొనుగోలు లేదా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మరోవైపు గోల్డ్ ఫ్యూచర్స్ మ్యాచ్ మేకింగ్ లావాదేవీలు. ప్రధాన మార్కెట్ కు వచ్చినప్పుడు డెలివరీ సాధ్యం కాకపోవచ్చు. పెట్టుబడిదారులను కొంత మేరకు ప్రమాదంలో పడేస్తుంది. US $ 1000 డిపాజిట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ హ్యాండ్ ట్రేడింగ్ చేపట్టవచ్చు. గోల్డ్ ఫ్యూచర్స్ కు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరం. అందువల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: