మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని తమ జీవనాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే వీరు ఏం తీసుకున్నా సరే ఆరోగ్యకరంగా చక్కెర లేని ఆహారాలు తీసుకోవాలని వైద్యులు సైతం సలహా ఇస్తున్నారు. అలాంటప్పుడు డయాబెటిస్ వారు తీసుకునే ఆహారంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ వారికి ఇప్పుడు చెప్పబోయే ఒక ఆహారం బెస్ట్ మెడిసిన్ అని చెప్పవచ్చు. అది ఏదో కాదు కాకరకాయ పొడి. కరివేపాకు తో తయారు చేసిన పొడిని తీసుకున్నా కూడా డయాబెటిస్ వారికి గొప్ప ఔషధంగా పనిచేస్తుందని అందరికీ తెలిసిందే.

కాకపోతే కాకరకాయ పొడి తీసుకునేవారికి డయాబెటిస్ అదుపులో ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ కాకరకాయ పొడి తినడం వల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యమని చెప్పవచ్చు. అయితే ఈ కాకరకాయ పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కాకరకాయ పొడి కి కావలసిన పదార్థాలు..
కాకరకాయలు - 5 చిన్నవి
శెనగ పప్పు - 4 టేబుల్ స్పూన్లు
మినపప్పు - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు - 3 టేబుల్  స్పూన్లు
ఎండు మిర్చి - 8 మీడియం సైజ్
వెల్లుల్లి రెబ్బలు - 8
చింతపండు - నిమ్మకాయ సైజ్
నూనె - 3 టేబుల్ స్పూనులు
ఉప్పు - రుచికి సరిపడా


తయారీ విధానం:
కాకరకాయలను శుభ్రంగా కడిగి చిన్నగా చక్రాల్లా కోయాలి. కళాయిలో నూనె వేసి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసి బాగా వేయించాలి. బ్రౌన్ రంగులోకి మారి క్రిస్పీ గా తయారయ్యే వరకూ వేయించాలి. ఇక ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక కళాయి తీసుకొని.. మినప్పప్పు, శెనగపప్పు, ధనియాలు వేసి బాగా వేయించాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించిన మసాలా దినుసులు,  కాకరకాయ ముక్కలు , చింతపండు , ఉప్పు, వెల్లుల్లి వేసి బాగా మిక్సీ పట్టాలి. మెత్తటి పొడి లాగా చేసుకోవాలి. గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని నెల రోజుల పాటు వేడి వేడి అన్నంలో ఉదయం రాత్రి తీసుకోవచ్చు. మనకు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి తోపాటు పొటాషియం, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇకపోతే చక్కెర స్థాయిని తగ్గించి డయాబెటిస్ ను  అదుపులో ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: