ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని కేవలం నిర్దిష్టమైన సమయాల్లోనే వీటిని తినాలని.. దీంతో ఇంకా ఎక్కువ లాభం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ఖర్జూరాలను తినేందుకు సరైన సమయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఖర్జూరాలను సాయంత్రం సమయంలో స్నాక్స్‌లా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో భోజనం చేసే వారికి సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో ఖచ్చితంగా ఆకలి వేస్తుంది. అందుకే వారు ఆ సమయంలో భోజనం చేయలేరు. అందుకే స్నాక్స్ తింటారు. అలాంటప్పుడు చాలా మంది కూడా నూనె వస్తువులు లేదా బేకరీ పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. వాటికి బదులుగా ఐదారు ఖర్జూరాలను తినాలి. దీంతో వారికి తక్షణమే శక్తి లభిస్తుంది. ఉత్సాహం వస్తుంది. వారికి మళ్లీ త్వరగా ఆకలి వేయదు. పైగా వారికి పోషకాలు కూడా లభిస్తాయి. దీంతో బరువు పెరుగుతామన్న భయం కూడా ఉండదు. కాబట్టి ఖర్జూరాలను సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తినడం ఉత్తమం అని చెప్పవచ్చు.ఇక జిమ్‌కు వెళ్లేవారు లేదా శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసే వారు ఆ పనులకు చేయడానికి ముందు ఖచ్చితంగా ఖర్జూరాలను తినాలి.


దీంతో వారికి శక్తి ఎక్కువగా లభిస్తుంది.అలాగే త్వరగా అలసిపోరు.  ఎక్కువ వ్యాయామం చేసేందుకు లేదా పని చేసేందుకు అవకాశం ఉంటుంది.అలాగే దీంతోపాటు క్యాలరీలు కూడా ఖర్చవుతాయి. అందు ఫలితంగా బరువు త్వరగా తగ్గేందుకు చాన్స్ ఉంటుంది. వ్యాయామం లేదా జిమ్ ఏదైనా పని చేసేందుకు కనీసం 30 నిమిషాల ముందు ఖచ్చితంగా నాలుగైదు ఖర్జూరాలను తినాలి. దీంతో వారికి ఎక్కువ మేలు కలుగుతుంది.ఇక జిమ్ లేదా వ్యాయామం ఇంకా ఏదైనా పని చేసిన తరువాత కూడా వెంటనే వారు ఖర్జూరాలను తినవచ్చు.దీంతో వారికి శక్తిని తిరిగి పుంజుకుంటారు.అలాగే అలసట తగ్గి ఉత్సాహం వస్తుంది. వారు మళ్లీ సులభంగా పనులు చేసుకోగలుగుతారు. అలాగే కండరాలు కూడా చాలా త్వరగా రికవరీ అవుతాయి. దీంతోపాటు శరీరానికి కావల్సిన పొటాషియం, మెగ్నిషియం ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి శరీరాన్ని చాలా ఉత్తేజంగా ఉంచుతాయి. కాబట్టి జిమ్ లేదా వ్యాయామం అనంతరం వెంటనే కూడా ఖర్జూరాలను తినవచ్చు. ఇలా తిన్నా కూడా ఆరోగ్యానికి ఎక్కువ లాభమే కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: