ప్రస్తుత కాలంలో చాలా మంది తీసుకుంటున్న జంక్ ఫుడ్ వల్ల లివర్ పనితీరు అనేది బాగా మందగిస్తోంది. పైగా చాలా మంది మద్యం కూడా విపరీతంగా తాగుతున్నారు. దీని వల్ల లివర్ అనేది మరింత డ్యామేజ్ అవుతోంది. ఈ క్రమంలోనే లివర్‌లో విష పదార్థాలు ఇంకా కొవ్వులు పేరుకుపోతున్నాయి. ఇవి లివర్ వ్యాధులకు ఖచ్చితంగా కారణమవుతున్నాయి. దీని వల్ల ఫ్యాటీ లివర్‌ ఇంకా లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. కొందరికి ఇది చాలా ప్రాణాంతకంగా మారుతుంది కూడా.అయితే ఇలాంటి దుష్పరిణామాల బారిన పడకుండా ఉండాలంటే అందుకు లివర్‌ను ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అందుకు నిమ్మ గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మాములుగా మనం నిమ్మరసాన్ని పిండినప్పుడు అందులో ఉండే గింజలను పడేస్తుంటాం.అయితే అవి పళ్ల కింద పడితే చాలా చేదుగా అనిపిస్తాయి. అందువల్ల వాటిని తినేందుకు అస్సలు ఇష్టపడరు. కానీ నిమ్మగింజలను తినడం వల్ల లివర్ ఖచ్చితంగా క్లీన్ అవుతుందని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది.


ఎందుకంటే వీటిల్లో ఆల్కలాయిడ్స్‌, టానిన్స్‌ ఇంకా ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి లివర్ ఎంజైమ్స్ ఉత్పత్తికి ఎంతగానో సహాయ పడతాయి. దీని వల్ల లివర్‌లో పలు రకాల ఎంజైమ్స్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. దాని ఫలితంగా లివర్ బాగా యాక్టివ్‌గా మారుతుంది. అప్పుడు లివర్ తనలో ఉన్న విష పదార్థాలు ఇంకా కొవ్వును వేగంగా బయటకు పంపిస్తుంది. దీంతో లివర్ బాగా క్లీన్ అవుతుంది.ఇలా నిమ్మ గింజలతో మనం లివర్‌ను చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. దీని వల్ల లివర్ పనితీరు కూడా బాగా మెరుగు పడుతుంది. లివర్ వ్యాధులు ఉన్నవారికి ఈ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా అలాగే ఈ గింజలను తినడం వల్ల రక్తం కూడా ఈజీగా శుద్ధి అవుతుంది. ఈ నిమ్మ గింజలను ప్రతి రోజూ 4 చొప్పున ఏదో ఒక సమయంలో తిన్నా చాలు. లేదంటే భోజనం చేసేటప్పుడు అన్నంలో పెట్టుకుని కూడా తినవచ్చు.అయితే చేదుగా ఉన్నాయని అనుకోని మాత్రం వాటిని పడేయకండి.ఎందుకంటే వాటితో ఎంతో గొప్ప మేలు జరుగుతుంది.కాబట్టి రోజూ వాటిని తినడం వల్ల లివర్‌ను చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: