మధుమేహం అనే వ్యాధి నేటి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. వయసు పెరిగే కొద్దీ చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగడం వలన మధుమేహ సమస్య వస్తుంది. అయితే ఇది నివారణ లేని అనారోగ్య సమస్య. ఇందుకు సంబంధించిన మందులను మరియు ఇన్సులిన్ ను నిరంతరం వాడడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.