తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది రోజున 10 లక్షల మంది పేదలకు తమ సొంతింటి కలను నిజం చేసేలా భూమి పూజలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.కేవలం ఇళ్లు కట్టడమే కాదు, నిర్ణీత కాల వ్యవధిలో వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉగాది పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇళ్ల నిర్మాణ పనులు పండుగ వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం విషయంలో జరిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కూటమి ప్రభుత్వం ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.10 లక్షల ఇళ్ల నిర్మాణం అంటే అది కేవలం పేదలకే కాదు.. భవన నిర్మాణ కార్మికులకు, సిమెంట్, ఐరన్ వ్యాపారులకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించనుంది. రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ రంగం పుంజుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందేలా 'ప్రజా దర్బార్' విజ్ఞప్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అర్హులైన వారంతా...
జూన్‌కు 2.26 లక్షలు, సెప్టెంబరులో 2.10 లక్షల ఇళ్లకు కూడా గృహప్రవేశాలు జరిగేలా లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాయి. 2029లోగా పేదలందరికీ ఇళ్లు కట్టించటంతో పాటు ఉచితంగా ఇంటి స్థలాలు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే అర్హులైన పేదలు, ఇప్పటి వరకూ ఇళ్లు లేని వారు సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసకోవచ్చు. స్థానిక గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి పక్కా గృహాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఏ ఏ డాక్యు మెంట్లు ఇవ్వాలో వారు చెబుతారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పని సరి. దీంతో పాటు సొంత ఇల్లు లేదని అఫడవిట్ ను కూడా తీసుకునే అవకాశముంది.
నారా లోకేష్ విశాఖలో 'ప్రజా దర్బార్' నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తుంటే.. చంద్రబాబు అమరావతి నుండి పాలనా సంస్కరణలతో దూసుకుపోతున్నారు. ఉగాది నాడు ప్రారంభించబోయే ఈ 10 లక్షల ఇళ్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి