గత రెండు దశాబ్దాలుగా దక్షిణాది సిని ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించిన త్రిష తన నటనతో అందంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. గతంలో త్రిష ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ ఎప్పుడైతే అయ్యిందో అప్పటినుంచి వివాహం గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. ఇటీవలే విజయ్ దళపతి, భార్య సంగీత విడాకుల వ్యవహారంలో కూడా త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కానీ త్రిష మాత్రం గతంలో పెళ్లి విడాకులు సహజీవనం పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి వైరల్ గా మారాయి.


ఒక ఇంటర్వ్యూలో త్రిష తన వివాహం ఎప్పుడు అనే ప్రశ్నపై మాట్లాడుతూ.. నన్ను చాలామంది వివాహం ఎప్పుడు చేసుకుంటావని అడుగుతున్నారు. దానికి నా దగ్గర ఒకటే సమాధానం ఉన్నది. నాకు నచ్చిన సరైన వ్యక్తి దొరికితే అప్పుడే వివాహం చేసుకుంటాను ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే మాత్రం అసలు వివాహం జరగకపోయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేసింది. ఎందుకంటే నాకు వివాహం చేసుకుంటే విడాకుల వరకు వెళ్లకూడదని భావిస్తాను, అందుకే తొందరపడి ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోనంటూ తెలియజేసింది త్రిష.



వివాహం అనేది కేవలం సమాజం కోసం తీసుకుని ఒక నిర్ణయంలో ఉండకూడదు. జీవితాంతం కలిసి ఉండగలమనే నమ్మకం కలిగినప్పుడే ఆ బంధం లోకి అడుగు పెట్టాలని తన అభిప్రాయంగా తెలిపింది. నా స్నేహితులలో చాలామంది ఇష్టం లేని వివాహం చేసుకొని బాధపడుతున్నారు. అలాంటి జీవితం నాకు వద్దు అంటూ తెలిపింది. అలా ఇష్టం లేని వ్యక్తితో కలిసి జీవించడం అంటే నరకమే.. దానికంటే ఒంటరిగా ఉండడమే ఉత్తమం అంటూ తెలియజేసింది త్రిష. తనకు నచ్చిన తోడు దొరికితే తాను కచ్చితంగా వివాహం చేసుకుంటానంటూ తెలియజేసింది. 42 ఏళ్లలో కూడా త్రిష యంగ్ హీరోయిన్స్ కు దీటుగా పోటీపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: