ఎదో వింత జంతువు కల్లో లేక ఏదైనా దెయ్యం కల్లో ఉన్నట్లు ఉన్న భయంకరమైన పండ్ల పేరు గ్వారాన పండ్లు.. ఇది ఎం పండు నిజంగానే ఇవి పండ్లేనా అనే డౌట్ ఉందికాదూ.. అవును ఇవి నిజంగానే పండ్లు. దక్షిణ అమెరికాలో ఇవి చాలా అరుదుగా దొరుకుతాయట. ఈ పండు దక్షణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో పాకుతూ వెళ్లే బీర చెట్టులా ఈ గ్వారాన మొక్క కూడా పాకుతూ ఈ పండ్లను ఇస్తుంది.ఈ మొక్క శాస్త్రీయ నామం  పల్లినియా క్యూపాన.. ఈ మొక్కలు అక్కడ మాత్రమే దొరుకుతాయట. ఈ పండ్ల విషయానికొస్తే.. అరుదుగా దొరికే ఈ పండ్లలో ఎన్నో ఓషధగుణాలున్నాయంటున్నారు. 


ఈ  పండ్ల రుచి కొంచెం పుల్లగా, ఉప్పఉప్పగా ఉంటుందట. అమెజాన్ అడవుల్లో నివసించే ప్రజలు ఈ పండ్లను సంజీవినితో పోలుస్తారట. ఈ పండ్లను తిన్నా, ఈ పండ్ల ద్వారా తాయారు చేసిన గ్వారాన పౌడర్ ను నీటిలో కలుపుకొని తాగినా ఎక్కువకాలం బతుకుతారని వారు నమ్ముతున్నారు. ఎందుకంటే ఒక మనిషికి సాధారణంగా వచ్చే తలనొప్పి, ఫీవర్ లాంటివి ఈ పండ్లను తీసుకుంటే అవి దగ్గరకి రావని అంటున్నారు. ఇంకా కాలిన గాయాలను నయం చేయడంతో పాటూ..సంసారం సాఫీగా సాగడానికి ఈ పండ్లు ముఖ్య ఓషధమని అంటున్నారు. 


ఇంకా ఈ పండ్లలో కాఫీ గింజల్లో ఉండే కెఫైన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ కెఫైన్ ఉంటుందట. ప్రతియేటా ఈ గ్వారానా పండ్ల ఉత్పత్తిలో… 70 శాతాన్ని ఎనర్జీ, సాఫ్ట్ డ్రింక్స్ లో ఉపయోగిస్తున్నారు. మిగతా 30 శాతం ఉత్పత్తిని నీటిలో పౌడర్‌లా కలుపుకొని తాగేందుకు, ఇంకా కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఉత్పత్తుల కోసం వాడుతున్నారట.


మరో విషయమేంటంటే.. సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాటిని నయం చేసి స్పెర్మ్ కౌంట్ పెంచేందుకూ ఉపయోగించే ట్యాబ్లేట్స్ లో ఈ పండ్లను ఉపయోగిస్తారట. మ్యూటన్స్, ఈకోలీ, సాల్మొనెల్లా వంటి ప్రాణాంతకమైన బ్యాక్టీరియా ను నాశనం చేయడంలోనూ ఈ పండ్లను ఎక్కువగా ఉపయోగిస్తారట. ఇంకా మన ఎముకలు గట్టి పాడటానికి కూడా ఈ పండ్లు సహాయపడతాయట. ఇంకా ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లతో తాయారు చేసిన ట్యాబ్లేట్లను ఎక్కువగా వాడతారట.జీర్ణవ్యవస్థలో సమస్యలు, మతిమరుపు, మెమరీ లాస్ వంటివి నయం చేయడానికి కూడా ఈ గ్వారాన పండ్లను ఉంపయోగిస్తారట. అతిభయంకరమై కాన్సర్ వ్యాధిని తగ్గించటానికి కూడా ఈ గ్వారానా పండ్లు ఉపయోగపడుతున్నాయట . అందుకే మార్కెట్లో ముఖ్యంగా మెడిసిన్ పరంగా ఈ పండ్లకు మంచి డిమాండ్ ఉంది.
 చూసారుగా భయంకరంగా ఉన్న కూడా వీటితో చాలా ఆరోగ్యం ఉందట. ఒకవేళ ఎక్కడైనా మీకు ఈ పండ్లు కనిపిస్తే తినడం మరువకండి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: