జుట్టు సమస్యల్లో ప్రధానమైనది ఒకటి చుండ్రు. దీన్ని లైట్ తీసుకుంటే డేంజరే. జుట్టు ఊడిపోవడానికి   దారితీస్తుంది. ఇంతకీ ఆ చుండ్రు ఎందుకొస్తుందంటే... తలలో పేలు ఉండటం వల్లే. ఒక్క పేను ఉన్నా చాలు... అది జుట్టును సర్వనాశనం చేస్తుంది. ఎప్పుడో రాలిపోయే జుట్టును... ఇప్పుడే రాలిపోయేలా చేస్తుంది. బట్టతల, ఇతర సమస్యలకు దారితీస్తుంది. అంతే కాదు... మన జుట్టు లోంచీ ఇతరుల జుట్టులోకి కూడా పేలు ఈజీగా వెళ్లగలవు. వాటికి చెక్ పెట్టేందుకు కొన్ని చిట్కాలు మీకోసం... 


 తలలో పేలను తరిమి తరిమి కొట్టేందుకు అద్భుతమైన ప్రయోగం కర్పూరం వాడకం.  మీరు వాడే కొబ్బరి నూనెలో కూడా కర్పూరం కలిపి తలకు రాసుకోండి.  క్రిములనూ, సూక్ష్మజీవుల్నీ సర్వనాశనం చేయగలిగే శక్తి కర్పూరానికి ఉంది. 


 వేపలో సూక్ష్మజీవుల్ని చంపేసే యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు బోలెడన్ని ఉన్నాయి. వేప నూనె లేదా వేప పేస్ట్ ఏదైనా సేకరించండి.   తలకు బాగా పట్టించండి. ఓ పావు గంట అలా జుట్టును ఆరనివ్వండి. ఆ తర్వాత చుండ్రుతోపాటూ... పేలూ పోతాయి.


 జుట్టుకు అత్యద్భుతమైన ఔషధంగా యాపిల్ సైడెర్ వెనిగర్‌ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే జుట్టును మెరిసేలా చెయ్యగలిగే శక్తి దానికి ఉంది.  అందువల్ల దీన్ని కొద్దిగా జుట్టుకు అప్లై చేసుకొని... ఓ పావు గంట తర్వాత తల స్నానం చేస్తే... జుట్టు మీకు థాంక్స్ చెబుతుంది.


 
 వెల్లుల్లి ఒక రకమైన వాసన వస్తుంది కదా. ఆ వాసన అంటే పేలకు అస్సలు పడదు.  జుట్టు త్వరగా పెరిగేందుకు కూడా వెల్లుల్లి బాగా ఉపయోగపడుతోంది. కొబ్బరి నూనె (మీరు ఏది వాడినా సరే)లో ఓ నాలుగైదు చుక్కలు వెల్లుల్లి రసం కలపాలి. తరువాత వెల్లులి నూనెను జుట్టుకు రాసి, ఓ గంట తర్వాత తల స్నానం చెయ్యాలి. ఇక ఆ తర్వాత మీరు రమ్మన్నా పేలు రావు.  ఈ చిట్కాలు పాటించి మీ జుట్టును ఆరోగ్యంగా మార్చుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: