డయాబెటిస్.. ఈ ఒక్క వ్యాధి ప్రపంచాన్ని వణికించేస్తోంది. ప్రపంచంలో 50 శాతం డయాబెటిస్ భారిన పడినవారు మన తెలుగు వారు అంటే నమ్ముతారా ? నిజం డయాబెటిస్ భారిన ఎంతోమంది భారతియులు పడుతున్నారు. ఒకప్పుడు అంటే ఈ వయసు వారికే ఈ డయాబెటిస్ వస్తుంది అని అనుకునే వారు. 


కానీ ఇప్పుడు పుట్టిన పసికందు అయినా తొమ్మిది నెలల పాపకు కూడా డయాబెటిస్ వచ్చేస్తుంది. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఈ డయాబెటిస్ వస్తుంది. అయితే ఈ డయాబెటిస్ ఎక్కువగా అధికంగా బరువు ఉన్నవారికి, శారీరక శ్రమ లేని వారికి ఎక్కువగా వస్తుంది. మరికొంతమందికి వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


అయితే నేడు.. నవంబర్ 14వ తేదీన ప్రపంచ డయాబెటిస్‌ డే సందర్భంగా ఈ వ్యాధి ఎన్ని రకాలు ఉంటుంది, వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల, ఆహార నియమాలు అన్నిటి గురించి ఇక్కడ చదివి తెలుసుకోండి.  


'డయాబెటిస్'లో రకాలు : డయాబెటిస్‌ రెండు రకాలు ఉంటాయి. అందులో మొదటి రకం టో ఇమ్యూనిటీ బీటా కణాలను మన దేహంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను నాశనం చేస్తుంది. డయాబెటిస్‌లో రెండో రకం శరీరానికి బీటా కణాలు తట్టుకోలేనప్పుడు అధికంగా ఇన్సులిన్‌ కావాల్సి వస్తుంది. ఈ రెండో రకాన్ని జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటారు. డయాబెటిస్‌ టైప్‌ 1 చిన్న పిల్లల్లో అధికంగా కనిపిస్తుంది. ఇన్సులిన్‌ తయారీ తగ్గిపోవడంతో మధుమేహం వస్తుంది. టైప్‌ 2 డయాబెటిస్‌ ఇన్సులిన్‌ ఉత్పత్తి శరీరం ఉపయోగించుకోలేదు. 


డయాబెటిస్‌ లక్షణాలు: డయాబెటిస్‌ ఉన్నావారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. నీరు కూడా సాధారణంకన్నా ఎక్కువగా త్రాగడం. మూత్ర విసర్జనకు ఎక్కువసార్లు వెళ్ళడం, బరువు తగ్గడం, గాయం తగిలితే త్వరగా మానకపోవడం, కాళ్ళు ,చేతులు నొప్పులు రావడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలను గమనించి ఒకసారి పరీక్షలు చేయించుకోవడం మంచిది. 


జాగ్రత్తలు ఇవి: వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి ఏ టైప్ డయాబెటిస్ అనేది తెలుసుకోవాలి. ప్రతిరోజు 30 ని. నడవాలి, కనీసం వారంలో 5 రోజులు పాటు నడకవాలి, అధిక బరువులు ఎత్తడం లాంటివి చెయ్యకూడదు. క్రమం తప్పకుండా వైద్యం చేయించుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. రాగులు, జొన్నలు, గోధుమలు, వంకాయ, బెండకాయ, దొండకాయ, మునగకాడలు, కాకర, ఆకుకూరలు, పొట్ల, కాబేజి, టమాటా, ఎక్కువగా తీసుకోవాలి, ఇంకా కుదిరితే రాగి జావ ఉదయం లేవగానే తాగటం ఎంతో మంచిది. కాగా సిగరేట్ మందు వంటి అలవాట్లు ఏమైనా ఉంటె వెంటనే మానుకోవాలి 


మరింత సమాచారం తెలుసుకోండి: