ప్రస్తుత ప్రపంచంలో చాలా మంది  నడుం నొప్పితో బాధ పడుతూనే ఉంటున్నారు.  ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే చాలా టిప్స్ పాటించడం చాలా మంచిది. ఇందులో భాగంగా  ఫిట్‌నెస్‌తో నడుం నొప్పికి ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసుకుందామా మరి...

 

నడుం నొప్పి అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్యే కాదు. ఇది దీర్ఘకాల సమస్య కూడా . నొప్పికి తాత్కాలిక ఉపశమనంగా మందులు వాడడం కన్నా నడక మంచిది అని తెలుపు ఉంటారు పరిశోధకులు. దీర్ఘకాలంగా వేధిస్తున్న నడుంనొప్పికి మాత్రమే నడక పనిచేస్తుంది తప్ప తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చే నొప్పికి ఇది పనిచేయదని వారు తెలియచేస్తున్నారు.

 

Image result for నడుం నొప్పితో

 

సుమారు లక్షన్నర మంది మీద వారు అధ్యయనం నిర్వహించిన తరువాత ఈ ఫలితాలను వారు తెలియ చేశారు. వీరిలో కొందరు దీర్ఘకాలంగా నడుంనొప్పితో బాధపడుతుండగా, మరికొందరు తాత్కాలిక నొప్పితో బాధపడుతున్నారు. కొందరికి ఎలాంటి సమస్యా లేదు. వీరందరిని ప్రతిరోజూ అరగంట పాటు నడవమన్నారు. కొంత కాలం తరువాత వీరి నడుంనొప్పిని పరిశీలించారు.

 

Image result for నడుం నొప్పితో

 

దీర్ఘకాలంగా నడుంనొప్పితో బాధపడుతున్న వారిలో పదహారు శాతం మంది నడుంనొప్పి నుంచి ఉపశమనం పొందారు. తాత్కాలిక నడుంనొప్పితో బాధపడుతున్న వారిలో ఈ లక్షణాలను బయటపడలేదు.నడక వలన నడుంనొప్పి తగ్గడానికి గల కారణాలను వీరు విశ్లేషించగా, ఎలాంటి వ్యాయామం చేయని వారిలో అధికబరువు సమస్యల తలెత్తుతుందనీ, ఇదే నడుంనొప్పి, వీపు నొప్పికి కారణం అని తేలింది.

 

నడక వలన శరీరంలోని అన్ని కండరాలు కదలడం వలన నడుం నొప్పి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం...నడుము నొప్పి ఉన్నవాళ్లు నడక మొదలు పెట్టండి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ సమస్యను పూర్తిగా తగ్గక పైన కొంచెం శాతం ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: