చిలగడదుంప  ఒక దుంప పదార్థము. ఎంతో రుచిగా ఉంటుంది. ఇవి అంతే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. సీజన్లో తక్కువ ధరకు సులభంగా అందుబాటులో ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా మరి..

 

 చిలగడ దుంపల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అని నిపుణులు తెలియచేస్తూ ఉంటారు. ఇవి చలికాలంలో మనము తినడం వల్ల ఆ సీజన్‌లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యలను నుంచి దూరం చేసి మనకు మంచిని చేకూరుస్తుంది.. ఎందుకంటే విటమిన్ సి అనేది జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేయడానికి బాగా సహాయ పడుతుంది. దీనిని తినడం వల్ల తక్షణ శక్తి కూడ మనకు కలుగుతుంది. ఈ దుంపల్లో బీటా కేరోటిన్, విటమిన్ ఈ, సీ, బీ 6, పొటాషియం, ఐరన్‌ ఎక్కువగా లభిస్తాయి.

 

ముఖ్యంగా చిలగడదుంపల్లో అధికంగా పొటాషియం  ఉండే గుణము ఉంది. ఇది గుండెకు చాల  మేలు చేస్తుంది. ఎక్కువగా  హార్ట్ బీట్‌ని సరి చేసేందుకు సాయపడుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలోని కండరాల, నరాల పనితీరు చాలా వరకు బాగా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కూడా మన గుండె కు ,ధమనులకు చాలా మంచిది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలకు అలసట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. చిలగడదుంపల్లోని ప్రత్యేక గుణాలు ఏమైనా గాయాలు అయినప్పుడు వాటిని త్వరగా తగ్గించే గుణము కూడా ఉంది.

 

 దుంపలను(గంజి  గడ్డలు) రెగ్యులర్‌గా తినడం వల్ల చర్మం ఎక్కువ కాంతివంతంగా మారుటకు అవకాశలు ఉన్నాయి. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. జుట్టు సమస్యలు చాలావరకు దూరం అవుతాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల ఎలాంటి స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండవనిచెబుతున్నారు నిపుణులు. ఈ చిలగడదుంపలు కొన్ని ఏరియాల్లో మాత్రమే దొరుకుతాయి. అవి కూడా సీజన్లో మాత్రమే దొరుకుతాయి. నిజానికీ మధుమేహులు దుంపలు తినడం  చాల మంచిది అని నిపుణులు తెలియచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: