ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కరోనా వైరస్ ప్రభావం వలన మనుషులు నేర్చుకున్న   పెద్ద పాఠం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో  ఎప్పుడూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని. శరీరం పని చేసే తీరులో ఎప్పుడు ఏ చిన్న తేడా కనబడినా కూడా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. అదేమీ సీరియస్ విషయం కాకపోవచ్చు, కానీ ఆ విషయం డాక్టర్లు తేల్చి చెప్తే మనకీ ప్రశాంతంగా ఉంటుంది.ఇతర కాన్సర్లతో పోలిస్తే కొలొరెక్టల్ కాన్సర్ విభిన్నమైనది. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో కామన్ గా వచ్చే కాన్సర్ల లో కొలోన్ క్యాన్సర్ మూడవది. ఇండియాలో కూడా స్త్రీ పురుషులిరువురూ ఈ కాన్సర్ బారిన పడుతున్నారు.ఈ కాన్సర్‌కి ప్రీ క్లినికల్ పీరియడ్ ఎక్కువకాలం ఉంటుంది. త్వరగా డిటెక్ట్ చేయగలిగితే ఈ కాన్సర్ ని క్యూర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. అందువల్లే ఎర్లీ స్క్రీనింగ్ అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొలొరెక్టల్ కాన్సర్ కొరకు చేసే స్క్రీనింగ్ లో బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్, కొలొనోస్కోపీ ఉంటాయి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అత్యవసరం. విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే తాజా కూరగాయలూ, హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. అప్పుడే, గట్, మరియూ కొలోన్ హెల్దీ గా ఉంటాయి.ఆల్కహాలిక్ బెవరేజెస్ ని పూర్తిగా మానేయడం  చేయాలి. ఒక వేళ పూర్తిగా ఎవాయిడ్ చేయలేకపోతే తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.పొగ తాగడం అంటే ధూమపానం చెయ్యడం పూర్తిగా ఆపేయాలి. ఆరోగ్యకరమైన బరువు ఎప్పటికప్పుడు మెయింటెయిన్ చేయాలి.నలభై ఐదేళ్ళ తరువాత కొలోన్ కాన్సర్ కొరకు స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఈ వ్యాధి ఉన్నట్లైతే ఇంకా ముదే స్క్రీనింగ్ చేయించుకోవాలి.ఇలాంటి మరెన్నో ఆరోగ్యవంతమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి ఇంకా మరెన్నో ఆరోగ్యవంతమైన విషయాలు గురించి తెలుసుకోండి. నిత్యం ఆరోగ్యంగా ఉండండి...

మరింత సమాచారం తెలుసుకోండి: