మనకు చిరుధాన్యాలు,తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయని మనకు తెలుసు. అంతేకాకుండా పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని, మనం రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. మరీ ముఖ్యంగా చిరుధాన్యాలు, కాయగూరలు,పండ్లు, పాలు,గుడ్లు వంటివి రోజువారీ ఆహారంలో తప్పకుండా ఉండాలి. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి,ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అంతేకాకుండా మన జీవన విధానం ఎంత సమృద్ధిగా ఉంటుందో, మనం కూడా అంతే ఆరోగ్యంగా వుండగలుగుతాము.


ప్రపంచంలోనే అత్యధిక ఫైబర్ ఎక్కువ కలిగిన చిరుధాన్యాల లో అత్యంత ప్రాచుర్యం పొందిన ధాన్యం మొక్కజొన్న. మొక్కజొన్న లో ఫైబర్ అధికంగా ఉండడంతోపాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. మొక్కజొన్నను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బలహీనంగా ఉన్న వారికి ఎక్కువ శక్తి లభిస్తుంది. మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కాబట్టి ఇది నెమ్మదిగా జీర్ణం అవ్వడం వల్ల,ఎక్కువసేపు శక్తిని అందిస్తుంది. సుమారు 100 గ్రాముల మొక్కజొన్న లో 21 గ్రాముల పిండి పదార్థాలు కలిగి ఉంటుంది.  శారీరకంగా శక్తి అందించడమే కాకుండా మెదడుతో పాటు నాడీ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది.


అలాగే మొక్కజొన్న లో ఐరన్,విటమిన్ బి12, పోలిక్ యాసిడ్ లు  అధికంగా ఉండడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి, రక్తహీనత  సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలోని గ్లూకోజ్,ఇన్సులిన్ ప్రతిస్పందనలను గణనీయంగా తగ్గిస్తుంది. మొక్కజొన్న తిన్న తర్వాత శరీరంలోని నెమ్మదించిన రక్తప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, జీర్ణ శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ను కూడా అరికడుతుంది.


మొక్కజొన్న లో కెరోటినాయిడ్లు, లూటిన్ ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఫ్రీరాడికల్స్ కారణాల వల్ల కలిగే నష్టాలను నివారించి,కంటిచూపును మెరుగుపరుస్తుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. మొక్కజొన్న లో సహజ పిండి పదార్థాలు ఉండటం వల్ల గ్లూటెన్ ఫ్రీ కాబట్టి బంక జిగురు వంటి సమస్యలు ఉండవు. మొక్కజొన్నను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు దరిచేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి: