చాలా మంది మహిళలకి డెలివరీ తరువాత పొట్ట పై స్ట్రెచ్ మార్క్స్ పడటం అనేది సహజం. అలాగే పొట్ట కూడా పెరుగుతుంది. ఎంత తగ్గించుకోవాలన్నా తగ్గదు. ఇంకా తగ్గించుకోడానికి ఏం చెయ్యాలో తెలియక చాలా తిప్పలు పడుతుంటారు మహిళలు. అయితే ఇందులో కంగారు పడాల్సిన పని ఏమి లేదు. చాలా ఈజీగా సహజంగానే తగ్గించుకోవచ్చు. కాకపొతే ఈ పద్ధతులు మాత్రం తూచ తప్పకుండ పాటించాలి. తప్పకుండ మీ సమస్య తీరిపోతుంది.మహిళలు డెలివరీ తరువాత ఖచ్చితంగా పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. చిక్కుళ్లు, సీ ఫుడ్, గుడ్లు, సోయ వంటివి క్రమం తప్పకుండా తినాలి. కండరాలు బలంగా తయారైతే క్రమంగా పొట్టపై సాగిన చర్మం పూర్వ స్థితికి చేరుకుంటుంది.ప్రసవం పూర్తయి రెండు మూడు రోజులయ్యాక ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగడం ప్రారంభించాలి.


శరీరంలో ఎక్కువ నీరు ఉంటే చర్మం సాగదు. అదనపు కొవ్వును కూడా కరిగిస్తుంది. జీవ క్రియ మెరుగుపడుతుంది. సాధారణ రోజుల్లో తాగే నీరు కంటే 4 కప్పులు అదనంగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.వారానికి కనీసం మూడు రోజులైనా కార్డియో ఎక్సర్‌సైజులు చేస్తే మీ పొట్ట చుట్టూ చర్మం టైట్‌ అవుతుంది. క్యాలరీలు కూడా ఖర్చవడంతో కండరాలు గట్టిపడతాయి. రోజుకు కనీసం 20 నిమిషాలపాటు స్విమ్మింగ్, జాగింగ్, బైక్ రైడింగ్ వంటివి చేసినా సత్ఫలితాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. స్కిన్ టైట్‌గా మారడానికి కొంత మంది ప్రత్యేక వ్యాయామాలు చేస్తుంటారు. కానీ ప్రసవం అయిన కొన్నాళ్లపాటు బరువులు ఎత్తడాలు, వ్యాయామాలు చేయకూడదు.


కార్డియో ఎక్సర్‌సైజులు మినహా మరేవీ చేయకండి.విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ సి కలిసిన కొన్ని రకాల ఆయిల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఈ ఆయిల్స్‌కి ఉంది. చర్మం సాగిపోయిన చోట ఇటవంటి ఆయిల్స్‌తో మసాజ్ చేయించుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. రోజుకు రెండు సార్లు మసాజ్ చేయించడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కలిసి ఆయిల్ లేదా బాదం నూనెతో మసాజ్ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి.ఇక ఈ పద్ధతులు రోజు పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు మీకు కనిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: