కరోనా వైరస్ తో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఇక ఇప్పుడు సరికొత్తగా మరొక వైరస్ వేరియంట్ చైనా ల్యాబ్ నుండే వెలువడిందని, చైనా లోని కొంతమంది శాస్త్రవేత్తలు మనుషులకు సోకే విధంగా ఈ వైరస్ ను సృష్టించబడినట్లు రిపోర్టులో తేలిందట. ఈ వ్యాధికి కారణమైనటువంటి ఈ వైరస్ వేరియంట్ ను చైనా పరిశోధకులు, అక్కడి కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారాన్ని గూఢాచారుల ద్వారా తెలియజేయడం జరిగింది.

WIH  సహాయంతోనే మానవులకు ఈ వైరస్ ను సోకేలా అక్కడి శాస్త్రవేత్తలు పనిచేసినట్లు ఒక రిపోర్టులో తేలింది. అయితే ఈ వైరస్ ఎలా పుట్టింది? మొదటిసారి ఎక్కడ వ్యాపించింది? అనే విషయాలు ఇప్పటికి కూడా ప్రపంచ శాస్త్రవేత్తలు ఎంత వెతికినా కూడా సమాధానం దొరకలేదు. సరైన ఆధారాలు మాత్రం ఇంకా ఇప్పటికి కూడా దొరకలేదు.

కానీ ఇది చైనా వైరస్ అని USA వారు అనడంతో అప్పట్నుంచి ఈ మాట ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంది. అలాంటి వార్తలు ఎక్కువగా ట్రంప్ ఉన్నప్పుడే వినిపిస్తూ వచ్చాయి.. అయితే ఈ వార్తలను చైనా వాళ్లు కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు COVID-19 వైరస్ మాత్రం చైనాలోని "వుహాన్"అని లాబ్ లో  పుట్టుకొచ్చినట్టు ఆధారాలు తెలుపుతున్నాయి.

ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 4.4 మిలియన్ల మనుషులు చనిపోయారు. ఈ రిపోర్ట్ ను హౌస్ ఫారిన్ అఫైర్ కమిటీ సభ్యులు మైక్ మెక్ కాల్ ప్యానెల్ తో వెల్లడించారు. కానీ చైనా ప్రభుత్వం మాత్రం ఈ వైరస్ ను తాము సృష్టించలేదని చెబుతున్నది. కానీ వూహాన్ నుంచే  ఈ వైరస్ వచ్చిందనే వార్తను  చైనా ఖండించింది. కానీ మొదటి కేసు వారి దగ్గరే కనుగొన్నారు. ఇక అప్పటి నుంచి దేశమంతటా కరోనా చుట్టుముట్టింది.

చైనా లోని కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం WIH దగ్గరలో ఉన్న మార్కెట్ లోని జంతువుల వల్ల ఈ వైరస్ వ్యాపించి ఉంటుందని అనుమానంతో చెబుతున్నారు. అయితే ఇది ఎలా వచ్చిందనేది మాత్రం ఇంటెలిజెన్స్ బ్యూరో కమిటీ సంస్థ త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: