ఇక అప్పటి కాలంలో అన్నం వండాలంటే కనీసం గంట ముందు బియ్యం నానబెడుతారు.ఇక ఆ తర్వాత కట్టెలపొయ్యి మంటేసి అన్నానికి మంచిగా ఎసురు పెడుతారు.అప్పుడు అన్నానికి కేవలం చిల్లుల ప్లేటు మాత్రమే వాడేవారట. ఎందుకంటే గంజి వంచడానికి చాలా వీలుగా ఉంటుందని.ఇక నీరు బాగా కాగిన తర్వాత నానిన బియ్యాన్ని కడిగి దానిలో వేస్తారు. అది కొంతసేపటికి ఉడికి బాగా బుడగలుగా పొంగు వస్తుంది. ఇక ఆ తర్వాత చిన్నమంటతో అన్నం ఉడికేవరకు ఎదరుచూస్తారు. ఇక అన్నం ఉడికిందని నిర్థరణకు వచ్చిన తర్వాత ఆ గంజిని పూర్తిగా వంచేస్తారు. మరలా తిరిగి  మంటేలేని నిపుల పొయ్యి మీద పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి అన్నం అంతా కదిలేలా శరవను అటూ ఇటూ కదిలిస్తారు. ఇలా మరో 3 నిమిషాలకు అన్నం బాగా బిగుసుకుపోతుంది. ఆ తర్వాత ఆ అన్నం తినడానికి రెడీ అయిపోవచ్చు. అప్పట్లో అన్నం వండడానికి ఇలా కట్టెల పొయ్యిను మాత్రమే ఉపయోగించేవాళ్లట.

ఇక ఈ రోజుల్లో చాలా మంది కూడా రైస్‌ కుక్కర్‌ అలవాటు చేసుకున్నారు. రైస్ కుక్కర్ లో అన్నం వండడం వల్ల ఆహారం చాలా విషంగా మారుతుంది. మట్టిపాత్రలు వాడిన మన పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మనకు తెలిసిన విషయమే.ఇక ఈ రైస్‌కుక్కర్ వల్ల ఇరువై ఏండ్లకే కాళ్ల నొపులు, నడుం నొప్పి అంటూ మనుషులు ఇప్పుడు డీలా పడిపోతున్నారు. ఇక అన్నం వండేటప్పుడు వెలుతురు అలాగే గాలి తగిలేలా చూసుకోవాలి.దీనివల్ల ఇప్పుడిప్పుడు చాలామందిలో మార్పు అనేది వస్తుంది. ఇక కుయ్యో ముర్రో అంటూ మళ్ళీ పాత విషయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక రాగిసంకటి, రాగిజావ, జొన్న రొట్టెలు ఇంకా కొర్రలతో టిఫిన్లు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అన్నం వండేంత సమయం లేదనుకుంటే ఫ్రెజర్ కుక్కర్ ని వాడండి. చాలామంది మిక్సీని వాడినప్పుడు లేనిది రైస్‌కుక్కర్‌ ని ఎందుకు వాడటం లేదని అనుకుంటున్నారు. కాని అది ముమ్మాటికి సరైనది కాదు. ఇక మనం బయట వేరే ఆహారం ఏమి తిన్నా కాని రెండు మెతుకుల అన్నం తినందే అసలు కడుపు అనేది నిండదు. అలాంటి అన్నాన్ని మనం ఇలా రైస్ కుక్కర్లో తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం నిజంగా మన మూర్ఖత్వం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: