రెండో ప్రపంచ యుద్దం తరువాత  ఇదే తొలిసారి
ఆక్స్ ఫర్డ్  విశ్వ విద్యాలయం..  ప్రపంచంలోని అత్యుత్మమ యూనివర్సీటీలలో  ప్రథమ స్థానంలో నిలుస్తుంది. బ్రిటన్ లోనిఈ యూనివర్సిటీ  విద్యావిధానం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విశ్వవిద్యాలయాలకు ఆదర్శం. వివిధ దేశాల్లోని  పలు యూనివర్సీటీలు ఆక్స్ ఫర్డ్ తో  ఒప్పందాలు చేసుకుంటాయి.  శాస్త్ర , సాంకేతిక విషయ విజ్ఞానాన్ని పంచుకుంటాయి. ఈ యూని వర్సిటీ పలు అంశాలపై నిరంతరం  పరిశోధనలు జరుపుతుంటుంది. వాటి వివరాలను ప్రపంచానికి  అందిస్తుంటుంది. యావత్ ప్రపంచం ఆక్స్ ఫర్డ్  విశ్వవిద్యాలంయం వెలువరించే  అధ్యయనాలపై దృష్టి సారిస్తుంది. అది చేసే సూచనలు,సలహాలను మానవాళి పాటిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా మానవాళి పై కరోనా ప్రభావం అంశంపై చేసిన సర్వే మరుగున పడి ఉన్న చాలా విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ పరిశోధన పత్రం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. కోవిడ్-19తో అతలాకుతలం అయిన మానవ సమాజం తట్టుకోలేని నిజాన్ని ఆక్స్ ఫర్డ్ బైటపెట్టింది. కొవిడ్-19 బారినుంచి బతికి బయటపడ్డా , మనిషి సగటు ఆయుర్దాయం పడి పోయిందని తాజా పరిశోదనలో వెల్లడించింది. కరోనా పై పోరు మూడో ప్రపంచ యుద్దం లాంంటిదని ఆక్స్ ఫర్డ్ ఇదివరకే పేర్కొంది. రెండో ప్రపంచ యుద్దం కారణంగా ఎంత నష్టం జరిగిందో అంతటి ముప్పు కోవిడ్-19 కారణంగా ఏర్పడిందని తాజాగా పేర్కొంనింది. మనిషి ఆయుర్దాయం కోవిడ్-19 మూలంగా తగ్గిపోయిందని స్పష్టం చేసింది. ఇంతటి వైపరీత్యం సంభవించడం, సంభవిస్తుండటం రెండో ప్రపంచ యుద్దం తరువాత ఇదే మొదటిసారి అని వివరించింది. 29 దేశాలలో పరిశోధనలు నిర్వహించగా 27 దేశాలలో మనిషి సగటు ఆయుర్దాయం తగ్గినట్లుగా పరిశోధనల ద్వారా తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. చాలా దేశాలలో ఆయుర్దాయం ఒక్కసారిగా పడిపోవడం రెండో ప్రపంచ యుద్ద సమయంలో జరిగిందని తెలిపింది. అయితే ఆయుర్దాయం తగ్గడం అనే అంశం వివిధ దేశాలలో పలు విధాలుగా ఉందని, అన్ని దేశాలలోనుూ ఒక్కటిగా లేదని తెలిపింది. కోవిడ్-19 కారణంగా అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన వారు అరవై సంవత్సరాల లోపు వారు ఉన్నారు. అదే ఐరో దేశాలలో అరవై ఏళ్లు పై బడిన వారు ఉన్నారు. పరిశోధన జరిగిన అన్ని దేశాలలోనూ కామన్ గా ఒకే అంశం ఉంది. కోవిడ్-19 కారణంగా ఆయుర్దాయం తగ్గి ప్రాణాలు కోల్పోయిన వారు ఎక్కు వ మంది మహిళలే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: