
అందుకే చాలామంది సమయం ఉన్నప్పుడల్లా నీటిని తాగుతూ ఉంటారు. అయితే నీళ్లు తక్కువ కావడం ఎంత ప్రమాదకరమో ఎక్కువ తాగడం కూడా అంతే ప్రమాదం అని అంటున్నారు వైద్యులు.. అవసరానికి మించి మంచి నీళ్లు తాగడం వల్ల శరీరంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. సగటు మనిషి రోజుకు ఎంత నీరు తాగాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో 80 శాతం నీరే ఉంటుంది కాబట్టి..తక్కువ మోతాదులో మంచినీళ్లు తీసుకుంటే సరిపోతుంది.. ఇలా శరీరానికి అవసరమయ్యే నిష్పత్తిలో నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే అవయవాలు, కణాలు కూడా చక్కగా పనిచేస్తాయి. ప్రతిరోజు నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలని సూచిస్తుంటారు..కానీ మనం తినే ఆహారంలో కూడా నీటి శాతం ఉంటుంది. కాబట్టి రోజుకు మూడు లీటర్ల కంటే తక్కువ నీటిని తాగితే సరిపోతుందట.
ఇక రెండు నుంచి రెండున్నర లీటర్ల నీటిని తీసుకుంటే మంచిది..అంతకుమించి మోతాదులో నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం అసమతుల్యత ఏర్పడి కణాల పనితీరు కూడా నెమ్మదిగా దెబ్బతింటుందట. అలాగే అవయాల పనితీరు కూడా దెబ్బతింటుంది. అధిక నీటిని తాగడం వల్ల రక్తంలో సోడియం లెవెల్స్ తగ్గుతుంది..కాబట్టి అప్పుడు వచ్చే సమస్యను మనం హైపోనట్రేమియా అని అంటారు. ఇలా ఎక్కువ నీటిని తాగడం వల్ల తలనొప్పి , నీరసం , మత్తు, వికారంగా అనిపించడం ఒక్కోసారి కోమా లోకి పోయే అవకాశాలు కూడా ఉంటాయి.
ఎంత నీటిని తాగాలి అనేది కూడా మన శరీరం నుంచి వచ్చే మూత్రం నిర్ణయిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మీకు కనుక మూత్రం లైట్ బ్లూ కలర్ లో వస్తున్నట్లయితే, నీటిని ఎక్కువగా తాగుతున్నారని సందేశం. కాబట్టి అప్పుడు మీరు రోజుకు రెండు లీటర్లు లేదా ఒకటిన్నర లీటరు నీటిని తాగితే సరిపోతుంది.