మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తగ్గట్టు ఆరోగ్య నియమాలు కూడా పాటించాలి. లేకపోతే మునుముందు నష్టాలను చవిచూడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకొని, గుండెను ఆరోగ్యంగా పదిలంగా పదికాలాల పాటు చూసుకోవాలి. అయితే ఇందుకోసం ఏమి చేయాలో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..

దోసకాయ , పుదీనా టీ ఎలా తయారు చేయాలి అంటే.. కావాల్సిన పదార్థాలు..చిన్న దోసకాయ ఒకటి, పుదీనా ఆకులు గుప్పెడు, తేనె అర టేబుల్ స్పూన్, గ్రీ టీ బ్యాగ్ కు 2..ఎలా తయారు చేసుకోవాలి అంటే .. ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని పోసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిలోకి పుదీనా ఆకులు,  దోశ కాయ ముక్కలు ,గ్రీన్ టీ బ్యాగులు వేసి మూత పెట్టాలి. ఇప్పుడు మరొక గిన్నెలో కొన్ని వేడి నీళ్లు తీసుకుని అందులో అర టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాగా మరగబెట్టిన టీ నీ తీసుకొని.. అందులో పక్కన పెట్టుకున్న తేనె నీటిలో కలపాలి. ఇప్పుడు పూర్తి మిశ్రమాన్ని వడకట్టి అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి , కొన్ని కీరా ముక్కలు,  పుదీనా ఆకులు వేయాలి. చల్లదనం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తే పుదీనా దోశకాయ టీ సిద్దమవుతుంది.


పరగడుపునే కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా ఈ టీ ను తాగొచ్చు.ఈ  టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా అజీర్తి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది . అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని పదిలం  చేయడంలో ఈ టీ చాలా చక్కగా పనిచేస్తుంది. అధిక రక్తపోటు,  రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ప్రతిరోజు పరగడుపున దోసకాయ , పుదీనా టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: