అసలు ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. ఇక మారిన మన జీవన విధానం ఇంకా ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను తినడం, వ్యాయామం చేయకపోవడం, శరీరంలో కొలెస్ట్రాల్ ఇంకా అలాగే ట్రై గ్లిజరాయిడ్స్ ఎక్కువగా పేరుకుపోవడం వంటి ఎన్నో కారణాల వలన ఈ సమస్య చాలా ఎక్కువగా తలెత్తుతుంది.అలాగే రక్తం  చిక్కగా ఉండే వారిలో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇక అస్థవ్యస్థమైన జీవన విధానం కారణంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో చాలా అడ్డంకులు ఏర్పడతాయి. ఈ అడ్డంకులు ఏర్పడడం వల్ల గుండెకు రక్తం సరఫరా అవ్వక హార్ట్ ఎటాక్ సమస్య బాగా తలెత్తుతుంది. ఒకవేళ ఈ అడ్డంకులు కనుక చిన్నగా ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చినప్పటికి ఖచ్చితంగా ప్రాణ హాని  ఉంటుంది. అడ్డంకులు ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో రక్తసరఫరా పూర్తిగా ఆగిపోయి హార్ట్ ఎటాక్ రాగానే ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే హార్ట్ ఎటాక్ సమస్య వచ్చే ముందు మనకు కొన్ని లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి మనం హార్ట్ ఎటాక్ సమస్యను ముందుగానే గుర్తించవచ్చు.


హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఖచ్చితంగా మన ఛాతిలో నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి ఎక్కువయ్యి క్రమంగా ఎడమ భుజం కండరాల దాకా వెళ్తుంది. అలాగే హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కళ్లు తిరిగినట్టుగా కూడా మీకు ఉంటుంది.రక్తం పలుచగా అవ్వడం వల్ల గుండెకు రక్తసరఫరా అనేది జరుగుతుంది. అలాగే నైట్రో గ్లిజరిన్ రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులను తొలగించడంలో చాలా సహాయపడుతుంది. రక్తం చిక్కగా ఉండే వారు ఇంకా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న వారు ఈ మందులను దగ్గర ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అలాగే హార్ట్ ఎటాక్ సమస్య వచ్చే అవకాశం ఉన్న వారు రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్ కు, తీపి పదార్థాలకు ఇంకా నూనెలో వేయించిన పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. శరీరంలో కొలెస్ట్రాల్ పేరేకుపోకుండా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. రోజు వ్యాయామం చేయాలి. చక్కటి జీవన విధానాన్ని ఖచ్చితంగా పాటించాలి.ఈ విధంగా ఈ జాగ్రత్తలను తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ సమస్య వచ్చినప్పటికి ప్రాణాలు పోకుండా మనల్ని మనం ఈజీగా కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: