ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.. అయితే కొన్ని ప్రాంతాలలో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతటి వేడి వాతావరణం లో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తీవ్రంగా వీచే వేడి గాలుల వల్ల అధిక ఎండల వల్ల మనిషి డీ హైడ్రేట్ అవుతారు..దీంతో మనిషి మూర్చపోయే ప్రమాదం కూడా ఉంది.. గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.. అంతేకాదు ఎండల తీవ్రత కారణంగా ప్రజలు స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు ..అయితే ఇలా అపస్మారక స్థితిలో ఉన్న వారిని స్పృహలోకి తీసుకురావడానికి వారికి నీరు తాగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు..

ముఖ్యంగా అపస్మారక స్థితిలో ఉన్న వారిని స్పృహలోకి తీసుకురావడానికి చేయాల్సిన ప్రథమ చికిత్స చాలా మందికి తెలియదు.. అందులో భాగంగానే ఇలా నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తారు.. అయితే స్పృహ తప్పిన వారికి నీళ్లు తాగిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని వైద్యనిపుణులు స్పష్టంగా తెలియజేశారు .. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని విలువైన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రథమ చికిత్స ఎలా చేయాలో వెల్లడించింది.. ఎవరైనా అకస్మాత్తుగా స్పృహ తప్పితే వారికి నీళ్లు ఇవ్వకూడదు.. అపస్మారక స్థితిలో ఉన్న వారికి నీళ్లు తాగించినప్పుడు వారు నీరు సరిగ్గా తాగలేరు.. నీళ్లు కడుపులోకి ప్రవేశించవు.. అలాంటి సమయంలో గుండెల్లో మంటలు రావచ్చు ..శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవవచ్చు. వారి ఆరోగ్యం మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి.. అందుకే స్పృహ లేని వ్యక్తులకు నీళ్లు తాగించే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి..

అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు ముందుగా వారి తలను చేతులతో పైకి లేపాలి. ఆ తర్వాత ముఖం మీద కొన్ని నీళ్లు చల్లాలి.. ఆ తర్వాత శ్వాస తీసుకుంటున్నారా? లేదా ? పల్స్ ఉందా? లేదా ? అని చూడడం తప్పనిసరి .. ఈ రెండు ఉన్నట్టయితే ఇక ఆ వ్యక్తి ఆరోగ్యానికి డోకా ఉండదు. స్పృహ లేని వ్యక్తికి శ్వాస సరిగ్గా రాకపోతే వెంటనే సి పి ఆర్ చేయాలి.. ఇక దీనిని ఎలా చేయాలంటే రోగి యొక్క చాతి మధ్యలో ఎవరైనా సరే  తమ రెండు అరచేతులను ఒకదానిపై ఒకటి పెట్టాలి.. ఆ తర్వాత నెమ్మదిగా ఛాతిని ఒక నిమిషంలో 100 నుండి 120 సార్లు పుష్ చేయాలి. అలా రెండు మూడు సార్లు చేయడాన్ని ఇక్కడ సిపిఆర్ అంటారు . ఇలా చేయడం వల్ల శరీర భాగాల్లో ఆక్సిజన్ తో కూడిన రక్తం సరఫరా అయి. మనిషి స్రృహలోకి వస్తారు..  వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: