గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో డిసెంబ‌ర్ 2వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటయింది.'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము' భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది.
1989: భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు.
1991: సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్ర్యం గుర్తించడానికి కెనడా, పోలాండ్ భూమిపై మొదటి దేశాలుగా మారాయి.అధికారికంగా సోవియట్ సామ్యవాద గణతంత్రాలు సమాఖ్య, సూక్ష్మ రూపం యు.ఎస్.ఎస్.ఆర్, ఇంకనూ సోవియట్ యూనియన్, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సోషలిస్టు రాజ్యం. ఇది యురేషియాలో 1922 నుండి 1991 వరకు విలసిల్లింది. 1991 లో ఇందు నుండి దీని రిపబ్లిక్ రాష్ట్రాలు విడిపోయాయి.
1993: స్పేస్ షటిల్ ప్రోగ్రామ్: ఎస్ టి ఎస్-61 - హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేరు చేయడానికి నాసా ఒక స్పేస్ షటిల్ ఎండీవర్ మిషన్‌ను ప్రయోగించింది.
1999: గ్లెన్‌బ్రూక్ రైలు ప్రమాదం: సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ దగ్గర రెండు రైళ్లు కొట్టుకొని ఏడుగురు ప్రయాణీకులు మరణించారు.
2002: జనరల్ నిర్మల్ చంద్‌విజ్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

జననాలు

1912: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (మ.2004).
1930: గారీ బెకర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2014).
1937: మనోహర్ జోషి, మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి.
1960: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి (మ.1996).విజయలక్ష్మి 1960, డిసెంబరు 2 న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది., "స్మిత" అని తెరపేరు ధరించింది. సిల్క్ స్మిత మొదటి చిత్రము తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్, బహుళ ప్రజాదరణ పోందడంతో ఆమె తన పేరును సిల్క్ స్మిత గా మార్చుకుంది
1974: అపూర్వ, తెలుగు సినిమా నటి.


మరణాలు

1996: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1919)
1997: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి (జ.1907).

మరింత సమాచారం తెలుసుకోండి: