దాదాపు 130 సంవత్సరాల క్రితం అమెరికాలో సందడి చేస్తున్న మంచు గుడ్లగూబ తిరిగి ఇప్పుడు న్యూయార్క్ సిటీలోని సెంట్రల్ జూ పార్కులో కనిపించడంతో ఎంతో మంది పక్షి ప్రేమికులు ఈ గుడ్లగూబను చూడటానికి పార్కు చేరుకుంటున్నారు. అయితే 1890 సంవత్సరం లో మంచి గుడ్లగూబలు ఎక్కువగా సందడి చేసేవి. కాలక్రమేణా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఈ గుడ్లగూబలు అంతరించిపోతున్నాయని నేచురల్ హిస్టరీ మ్యూజియం పక్షి శాస్త్ర విభాగం కలెక్షన్ మేనేజర్ పాల్ స్వీట్ తెలిపారు
ఈ మంచు గుడ్లగూబలు ఎక్కువగా టండ్రాల్లో కనిపిస్తుంటాయి. కేవలం శీతాకాలంలో మాత్రమే దక్షిణ దిశగా ప్రయాణిస్తాయని పాల్ స్వీట్ తెలిపారు. ఈ పక్షిని చూడటానికి అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో గుడ్లగూబ ఆందోళనకు గురి అవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అయితే ఈ పక్షికి సంబంధించిన వీడియోను మన్హటన్ బర్డ్ అలర్ట్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేయడంతో పాటు,''సెంట్రల్ పార్కు నార్త్ మెడో ప్రాంతంలో మంచు గుడ్లగూబ కనిపించింది". ఈ పక్షిని చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పక్షికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి