మృగ మదంబచూడ మీద నల్లనుండు
పరిడవిల్లు దాని పరిమళంబు
గురువలైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!
భావం :
కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ, దాని సువాసన అంతటా వ్యాపించును. ఆ రీతిగనే మంచివారి గుణములు పైకి గొప్పగా కనిపించకపోయినా అంతటా వ్యాపిస్తాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: