ఓ కుక్కకు పక్షుల గుడ్లు తినే అలవాటు ఉండేది. అది పొలంగట్ల మీద, నదీ తీరాల్లో తిరుగుతూ తీతువు పిట్టల గుడ్లు కనబడితే చాలు గుటుక్కున మింగేసేది. నదుల గట్ల మీద ఇసుకలో తాబేళ్ల గుడ్ల కోసం వెతుకుతూ ఉండేది.
ఓ రోజు కుక్క నదిగట్టు మీద ఓ నత్తగుల్లను చూసింది. దాన్ని గుడ్డే అనుకొని గబుక్కున మింగేసింది. కుక్కపొట్టలోకి వెళ్లిన నత్తగుల్ల ముక్కులు పేగుల్లోకి చొచ్చకుపోయాయి అవి తీవ్రంగా బాధించడం మొదలు పెట్టాయి. దాంతో కుక్క బాధతో విల విల లాడిపోసాగింది. అప్పుడు అనుకొంది కుక్క గుండ్రని వన్నీ గుడ్లే అనుకొని పొరబడ్డాను. నాకు తగిన శాస్తే జరిగింది. అనుకొని బాధపడసాగింది.
కంటికి కనబడ్డ వస్తువులన్నీ ముందూ వెనకా చూడకుండా తింటే, ఇలాగే తిప్పలు పడాల్సి వస్తుంది. తినదగిన వస్తువని తెలుసుకొన్న తర్వాతే ఏదైనా తినాలి. తెలుసుకోకుండా తింటే కష్టాలు తప్పవు.
నీతి : ఆలోచించకుండా ఏ పనీ చేయరాదు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి