చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అందరు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నుండి చాలా నేర్చుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు తల్లిదండ్రులను చూసే అన్ని విషయాలు నేర్చుకుంటారని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. కానీ.. మనం కూడా వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు.

ఇక పిల్లలో ఉండే అమాయకత్వం, కల్మషం లేని నవ్వు ప్రతిదీ మనకు నిత్య జీవిత పాఠమే. ఇక పిల్లలు పరిచయం లేని వ్యక్తులను చూసిన సరే కల్మషం లేకుండా నవ్వేస్తుంటారు. అయితే అలాంటి స్పందనే ఎదుటి వాళ్ల నుంచి వస్తుందని అన్నారు. అంతేకాక.. నవ్వే ముందు ఎందుకు నవ్వాలి అనే ప్రశ్న వాళ్లకుండదని అన్నారు. ఇక ఇట్టి మనకు వర్తిస్తుందని అన్నారు.

అంతేకాదు.. మన ఇంటిపక్కో, బస్సులో పక్కసీటులోనో, ఉద్యోగంలోనో, కొత్త వాళ్లతోనో మాట్లాడాలా వద్దా మాట్లాడితే ఏమనుకుంటారో, ఎలా పకరరించాలని అనుకుంటారు. ఇక ఇలా సవాలక్ష ప్రశ్నలు వేసుకోకుండా ఒకసారి నవ్వేస్తే చాలని అన్నారు. ఆలా స్నేహం మొదలవుతుందని చెప్పుకొచ్చారు. అయితే పిల్లలకు ఒక వస్తువునో, జంతువునో చూస్తే భయపడాలన్న విషయం మనం చెప్పేదాకా తెలీదని అన్నారు. ఇక మనమే అది బూచి అంటూ చెప్పి భపడతుంటారు. అయితే మనం ఇలా పూర్తిగా దేనికీ భయపడకుండా ఉండాలని కాదు కానీ అన్నింటినీ విపరీతంగా ఆలోచించడం మానుకోవాలి.

అయితే వయసు పెరిగే కొద్ది తిరస్కరణాల భయం, ఓటమి లాంటి ఆలోచనలు మెదడులో నాటుకుపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే వీటిని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నించాలని అన్నారు. పిల్లలను నవ్వడం, ఆడుకోవడం, పాడటం, చిన్నప్పుడు అందరం చేసేవే. కానీ పెద్దయ్యాక మెచ్యూరిటీ పేరుతో అవన్నీ మర్చిపోతుంటారు. ఇక సమయానికి, సందర్భానికి అనుగుణంగా అలా ఉండటం తప్పుకాదని అన్నారు. అయితే.. పూర్తిగా మన జీవితం నుంచి వేరు చేయకుండా ప్రతిక్షణం ఆనందంగా గడిపేలా చూసుకోవాలని అన్నారు. అంతేకాదు.. ఒక వయసు రాగానే మనం ప్రశ్నించే తత్వం మరిచిపోతాం అన్నారు. ఇరాక్ పిల్లల్లా మన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: