ఈ రోజుల్లో సిటీలలో నగరాలలో, ఒక చోటు నుంచి మరియొక చోటికి సరియైన టైములో వెళ్లాలనుకుంటే వెళ్లలేక పోతున్నాము. కారణము విపరీతమైన రద్దీగా ఉండడం. ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల మనము పోవలసిన ఆఫీసులకు, స్కూళ్లకు, అన్నిటికీ ఆలస్యము అయిపోతున్నది. ట్రాఫిక్ లో గంటలతరబడి ఆగుతూ ఆగుతూ ప్రయాణం చేయడం ఎవరికి ఇష్టం ఉండదు. . అందుకే, ఒక వ్యక్తి ట్రాఫిక్ సమస్యలు లేకుండా గాల్లో ప్రయాణించేందుకు ఏకంగాహెలికాప్టర్ ను సొంతంగా తయారు చేయాలని కుతూహలము కలిగినది. 

 

ఆ కోరిక నెరవేర్చు కొనుటకు ఇంట్లోనే తమకు అందుబాటులో ఉన్న టు వంటి పనికిరాని వస్తువులను అన్నింటినీ ఉపయోగించి 26 అడుగుల పొడవు గల హెలికాప్టర్‌ను చివరికి  తయారు చేశాడు. ఇండోనేషియా దేశమునకు చెందిన వ్యక్తి జున్‌జున్ జునేది అనే 42 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి ట్రాఫిక్‌కు విసిగిపోయినాడు. ఇంకా అప్పటి నుంచి ఇంటి వెనుకే హెలికాప్టర్ తయారు చేయడం మొదలుపెట్టాడు.తాను హెలికాప్టర్ తయారుచేసే విధానాన్ని మీడియాకు వివరించడం జరిగింది. 

 

ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా నగరంలో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. దీనివలన ఎంతో మంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల సమయం, ఇంధనం రెండూ కూడా వృథా అవుతున్నాయి. కావున సమయమును ఇంధనము ట్రాఫిక్ సమస్యను అధిగమించడం కోసము నేనే సొంతంగాహెలికాప్టర్ తయారు చేసుకుంటున్నా’’ అని తెలియచేయడం జరిగింది.


      
‘నేను18 నెలల కిందట ఈ హెలికాప్టర్ తయారీ చేయడము మొదలుపెట్టాను. ఇంతవరకు హెలికాఫ్టర్ కోసము.1,50,410 ఖర్చు చేశాను. నేను, నా కుమారుడు, మరియు మా పక్కింటి వ్యక్తి కలిసి దీన్ని తయారు చేస్తున్నాం. లికాప్టర్ తయారు చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలియజేశారు. ఈ హెలికాప్టర్‌ను పూర్తి చేస్తేనే నాకు సంతృప్తి లభిస్తుంది’’ అని కూడా తెలిపాడు. ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన పాప్‌కార్న్ వ్యాపార స్తు డు మహమ్మద్ ఫయాజ్ కూడా తన పనులు తొందరగా కావడానికి సొంతంగా హెలికాప్టర్ తయారు చేసుకున్నాడు. అనుమతి లేకుండా హెలికాప్టర్ నడపడం చట్ట విరుద్దమంటూ అక్కడి పోలీసులు హెలికాప్టర్ను సీజ్ చేశారు. మరి జునేదికి అనుమతి లభిస్తుందో లేదో మనమందరము కూడా అ వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: