తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి.  ఈ సంక్రాంతి విశిష్టత ఏంటేంటే మూడు రోజుల పండుగ.  భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులు పండుగను కన్నుల పండువగా జరుపుకుంటారు.  ముఖ్యంగా సంక్రాంతి అనగానే పందాల పండుగ అంటారు.  కోళ్లు, ఏడ్ల పందాలే కాదు.. కొంత మంది గాలిపటాలు ఎగుర వేసి ఏ పతంగి తెగిపోతుందో దానిపై కూడా పందాలు వేస్తుంటారు.  ఇక సంక్రాంతి పండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందు వరుసలో ఉంటుంది. కనుమ రోజు మినుము తినాలి అని చెప్పిన పెద్దలు అంటుంటారు.  ఈ పండుగ రోజున మనం తినటమే కాదు వ్యవసాయంలో రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులకు కూడా కనుమ రోజున వండిన పిండి వంటలను పెడతారు. 

 

కనుమ నాడు మినుము తినాలనేది సామెత. కనుమరోజు మినుములు తినాలి అన్న సామెత వెనుక కూడా అనేక అంతర్థాలు కనిపిస్తాయి.  సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ఈ సమయంలో క్రమేపీ వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి, మినుములు అందుకు అనుగుణంగా శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి. మినుములు తింటే ఒంట్లో వేడి పుడుతుంది. మినుములతో చేసిన పిండివంటలు తింటే శరీరానికి చక్కటి బలం వస్తుంది. తిండి ఉంటే కండగలదోయ్.. కండ ఉన్నవాడే మనిషోయ్.. అన్నారు పెద్దలు.  మూడు పండుగల్లో భాగంగా.. కనుమ రోజున మినుములతో చేసిన సున్ని ఉండలు. గారెలు, ఆవడలు చేసుకుంటారు. 

 

ఇక సంక్రాంతిని పండుగను మూడు రోజులు జరుపుకుంటారని తెలిసిందే... తొలిరోజు భోగి మంటలు వేసి పిండి వంటలు చేసుకుని పిల్లలు ఆనందంగా గడుపుతారు. రెండో రోజున తమ పెద్దలకు పెట్టుకుంటారు.  మూడో రోజు పూర్తిగా మాంసాహారం సంక్రాంతిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఇక పెరుగును ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లోనూ తప్పకుండా దానం చేయాలి.  ఈ సంక్రాంతి పండుగ పట్టణాలలో కంటే కూడా గ్రామాలలో ఎక్కువగా ఆనందంగా జరుపుకుటాంరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: