భారతీయ సంప్రదాయంలో పెళ్లి తర్వాత జరిగే ఘట్టంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. అన్నిటినీ సంప్రదాయంగా జరిపించడం ఆనవాయితీ. మొదటి రాత్రి చేసే అన్నిటిలో ఒక్కో దానిలో ఒక్కో మీనింగ్ ఉంది.తెల్లని దుప్పటిని బెడ్ పై వేయడం, పాలను తీసుకెళ్లడం , మల్లె పూలతో మంచాన్ని అలంకరించడం ఇవన్నీ కూడా సాంప్రదాయంలో ఒకటే.. అసలు మొదటి రాత్రి రోజు తెల్లని దుస్తులను ఎందుకు వేసుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

తెల్లని వస్త్రం వేయడం వెనుక రహస్యం ఏమిటంటే.. దీని వల్ల వధువు కన్వత్వాన్ని తెలుసుకోవచ్చట. తొలిరాత్రి కలయిక వల్ల రక్తం స్రావం జరిగితే అది తెల్లని వస్త్రంపై స్పష్టంగా కనపడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు ఆ వస్త్రంపై రక్తపు మరకలు గుర్తిస్తే వధువు కన్య అనేది పూర్వీకులు నమ్మకం. దీన్ని కూడా సంబరంగా జరుపుకునేవారు. దీన్ని ఉతకడానికి ముందు ఎంతో పవిత్రంగా ఆరాధించేవారు. అయితే, కన్యత్వం తెలుసుకోవడానికి రక్తం రావాలనే రూల్ లేదు. కొంతమంది అమ్మాయిలకు రక్తస్రావం జరగదు. కాబట్టి.. అలాంటి అమ్మాయిలను అనుమానించకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

 

 


శోభనం రోజు రాత్రి కొత్త జంట సహనాన్ని పరీక్షించడానికి బంధువులు, స్నేహితులు ఆటపట్టిస్తారు. సాధ్యమైనంత ఆలస్యంగా నిద్రపోయేలా ప్రయత్నాలు చేస్తారు. అందుకే కొన్ని రకాల ఆటలు ఆడిస్తారు. శోభనం గదిలోకి పాల గ్లాసు అనే సంప్రదాయం భారతీయ వివాహాల్లో సర్వసాధారణం. కుంకుమ పువ్వు, బాదం వేసిన పాలను వధూవరులు తొలిరాత్రి తాగితే సత్వరమే శక్తినిస్తుంది. ఈ పాలు శోభనం రాత్రి భార్యభర్తల మధ్య సాగే చర్యలను నిర్ధారించడానికి ఓ వాహకంగా పనిచేస్తాయి. ఇక మొదటి రాత్రి తెల్లని దుస్తులను వేసుకోవడానికి కారణం కూడా అదే కన్యత్వాన్ని తెలుసుకోవడానికి .. అదండీ మొదటి రాత్రి తెల్లని దుస్తులను వేసుకోవడం వెనుక అసలు రహస్యం..

మరింత సమాచారం తెలుసుకోండి: