సినీ సెలబ్రిటీలు ఇంటర్వ్యూల్లో ఒక్కోసారి తాము వాడే పదాల వల్ల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ భర్త, నిర్మాత జాకీ భగ్నాని కూడా అదే బాటలో నడిచి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఈ వివాదానికి రకుల్ తనదైన శైలిలో ‘ఫుల్ స్టాప్’ పెట్టే ప్రయత్నం చేశారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాకీ భగ్నాని మాట్లాడుతూ.. తమ బంధాన్ని ‘సిట్యుయేషన్షిప్’ (Situationship) అని పిలిచారు. సాధారణంగా ఈ పదాన్ని ఒక స్పష్టత లేని బంధానికి వాడతారు. పెళ్లైన తర్వాత కూడా జాకీ ఇలాంటి పదం వాడటంపై నెటిజన్లు మండిపడ్డారు.పెళ్లయిన తర్వాత కూడా ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉంటున్నామని, పరస్పర స్వేచ్ఛ ఇచ్చుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు.తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌కు రకుల్ ముందే ఫోన్ చేసి స్పీకర్‌ పెట్టి మాట్లాడతానని జాకీ చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. “ఇదేం సంస్కారం?” అంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.

తొలుత ఈ విమర్శలపై రకుల్ కూల్ గానే స్పందించారు. మీడియా తన భర్త మాటల్ని ముక్కలు ముక్కలు చేసి వివాదం చేస్తోందని, ఆ వార్తలు చూసి తాము నవ్వుకున్నామని అన్నారు. అయితే, నెటిజన్లు వదిలిపెట్టకుండా “భర్తను వెనకేసుకొస్తున్నావా?” అంటూ ట్రోలింగ్ పెంచడంతో రకుల్ రూటు మార్చారు.వివాదం ముదురుతుండటంతో రకుల్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో: తన వ్యాఖ్యల వల్ల తప్పుడు సంకేతాలు వెళ్లాయని గ్రహించిన జాకీ, వీడియోలో అందరికీ సారీ చెప్పారు.

 “మనం మిలీనియల్స్ లా ఉండాలి కానీ జెన్ జీ (Gen Z) లా ప్రవర్తించవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి?” అంటూ రకుల్ తన భర్తకు సరదాగా క్లాస్ పీకారు.తన మాటల్లో దురుద్దేశం లేదని జాకీ వివరణ ఇవ్వగా, ఆ విషయం తనకు తెలుసని, కానీ ప్రపంచానికి తెలియజేయడానికే ఈ వీడియో చేస్తున్నానని రకుల్ నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు.
సెలబ్రిటీలు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి నిరూపించింది. రకుల్ తెలివిగా ఈ వివాదాన్ని ఒక ఫన్నీ వీడియోతో ముగించే ప్రయత్నం చేశారు. జాకీ స్వయంగా క్షమాపణలు చెప్పడంతో ఈ ఇష్యూ ఇక్కడితో సర్దుమణిగే అవకాశం కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: