సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి వెనక వైపు నుంచి కనిపిస్తుండగా, దర్శకుడు బాబీ పక్కనే ఉండి ‘థమ్స్ అప్’ సిగ్నల్ చూపిస్తూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి లుక్ చాలా ఇంటెన్సివ్ గా, రా (Raw) గా ఉండబోతోందని సమాచారం. దీనికోసం బాబీ ప్రత్యేకమైన మేకప్ టీమ్ తో కలిసి పనిచేశారు.మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌ను బేస్ చేసుకుని బాబీ డిజైన్ చేసిన ఎలివేషన్లు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయమని టాక్.ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, సినిమా నేపథ్యం చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది.‘కాకాజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తుండటంతో, బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లు వస్తున్న వార్తలు సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి.
కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన ప్రియమణి నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కనిపించబోతున్నారనే వార్తలు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి.షూటింగ్ ఆలస్యమవుతుందనే రూమర్లకు ఈ లుక్ టెస్ట్ అప్‌డేట్ తో టీమ్ చెక్ పెట్టింది. బాబీ తన టీమ్ తో కలిసి పక్కా షెడ్యూల్స్ ను సిద్ధం చేస్తున్నారు. ఏదేమైనా గత వారం నుంచి ఊరిస్తున్న మెగా158 ప్రయాణం అధికారికంగా మొదలైంది. లుక్ టెస్ట్ పూర్తవ్వడంతో ఇక సెట్స్ పైకి వెళ్లడమే. షూటింగ్ ఆలస్యమవుతుందనే వార్తలకు ఈ అప్‌డేట్ తో టీమ్ చెక్ పెట్టింది. బాబీ తన టీమ్ తో కలిసి షెడ్యూల్స్ ను పక్కాగా రెడీ చేస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో మెగా మాస్ జాతర ఉండేలా ప్లానింగ్ జరుగుతోంది. మరి ఈ కొత్త లుక్ లో చిరంజీవి తన విశ్వరూపాన్ని ఎలా చూపిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి