ఆ అదృష్టం మీ సొంతం కావాలంటే కొంత సమయం ఇక్కడ వెచ్చించండి. భోజనం చేసాక చివర్లో దొరికే తీపి పదార్థాన్ని ఆస్వాదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొంత సమయాన్ని వెచ్చింది హ్యాపీగా ఇంట్లోనే కుకీస్ తయారు చేసుకోవచ్చు. మరెందుకాలస్యం డబల్ చాక్లెట్ కుకీస్ తయారు చేసుకోవడం ఎలాగో.. ఎలాంటి పదార్థాలను వాడాలో ఇప్పుడు చూద్దాం..
ఈ కుకీస్ కు కావలసిన పదార్థాలు :
పావు కప్పు వెన్న
పావు కప్పు కోకో పౌడర్
అరచెంచా వెనీలా
అరకప్పు అన్ని అవసరాలకి ఉపయోగపడే పిండి
ముప్పావు కప్పు చక్కెర
పావు కప్పు ఉప్పు
ఒకటిన్నర్ చెంచా పాలు
కొన్ని చాక్లెట్ చిప్స్
తయారీ విధానం :
ముందుగా పిండిని తీసుకోవాలి మైక్రోవేవ్ లో కొద్ది సేపు వేడి చేయాలి. అలా కొద్దిసేపయ్యాక పిండి వేగిందని అనుకున్నాక, దానికి కోకో పౌడర్, చక్కెర, ఉప్పు, వెన్న కలపాలి. ఆ తర్వాత పాలు, వెనీలా యాడ్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ తర్వాత చాక్లెట్ ముక్కలని కూడా కలుపుకోవాలి. పేస్ట్ కి చాక్లెట్ కలుపుకుంటే దాని రుచి పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన డబల్ చాక్లెట్ కుకీస్ రెడీ అయిపోయినట్టే. తియ్యగా తిన్నట్లు ఉంటుంది. దాంతో పాటుగా మంచి టెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. ఇలా తయారు చేసుకున్న కుకీలని రెండురోజుల్లోగా తినేయాలి. అదీగాక గాలికి పెట్టరాదు. రిఫ్రిజిరేటర్లో మాత్రమే ఉంచాలి. గాలికి పెడితే అవి పాడయిపోతాయి. చూసారుగా చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే ఈ కుకీస్ ను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.. పిల్లలు ఇష్టం గా తింటారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి