సాధారణంగా చాలామంది భోజనం చేతితో తింటే, మరికొంతమంది స్పూన్ తో తింటూ ఉంటారు. నిజానికి చేత్తో కొంచెం తిన్నా సరే కడుపు నిండిన భావన కలుగుతుంది .. అదే స్పూన్ తో తింటే ఎంత తింటున్నామో తెలియక ..తింటూనే ఉంటాం. నిజానికి భోజనం చేతితో తింటే మంచిదా..? లేక స్పూన్ తో తింటే మంచిదా ..? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నిజానికి మనం తినే ఆహారం ఒకటే అయినప్పటికీ, మోతాదు మారకుండా కడుపులో చేత్తో తినడం, స్పూన్  తినడం వల్ల తేడాలు తెలుస్తాయి. చేతితో అన్నం తింటే మనం తినే ఆహారంపై కాన్సెంట్రేషన్ పెడతాము.. ఎంత తింటున్నామని లెక్క కూడా ఉంటుంది.. నెమ్మదిగా నమిలి తినడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.. ఎంత అయితే మనం నమిలి తింటామో అప్పుడు జీర్ణాశయం కూడా ఒత్తిడికి గురి అవ్వదు. ఇక స్పూన్  తో తినడం వల్ల సాటిస్ఫాక్షన్ ఉండదు. అంతేకాదు స్పూన్ తో  తినడం వల్ల ఎక్కువ తిని, బరువు ఎక్కే అవకాశాలు కూడా ఉన్నాయి.

చేతితో భోజనం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. అంతేకాదు ఏదైనా ఆహార పదార్థాలను చేతితో తినడానికి తీసుకున్నప్పుడు,  మన బ్రెయిన్.. కడుపుకు సిగ్నల్ పంపిస్తుంది.. ఇలా ఎప్పుడైతే బ్రెయిన్ కడుపుకు  సిగ్నల్ పంపిస్తుందో,  అప్పుడు ఫుడ్ కూడా త్వరగా అరిగిపోతుందని చెప్పవచ్చు.. స్పూన్ తో తినేటప్పుడు మెదడు నుంచి సంకేతాలు పొట్ట కి వెళ్లవు .. కాబట్టి త్వరగా జీర్ణం అవ్వదు. ఇకపోతే చేతివేళ్ళపై నార్మల్ ఫ్లోరా అనే ఒక బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలిగించకుండా జాగ్రత్త పడుతుంది..

అంతేకాదు శరీరంలోకి బయట నుంచి ప్రవేశించే బ్యాక్టీరియా ని కూడా అడ్డుకుంటుంది.. చేతితో భోజనం చేయడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: