విషాదం : ఏదైనా అనుకోని సంఘటన జరిగితే భార్యలు ఆ విషయం గురించి ఆందోళన చెందుతూ.. మనసులోనే పెట్టుకుంటారు తప్ప భర్తకి మాత్రం చెప్పడానికి ససేమిరా అంటారు. వారిలో వారే కుమిలిపోతూ భర్తకు చెప్పి ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటారు.
అనారోగ్యం : ముఖ్యంగా భార్య విషయంలో చాలా బాధ పెట్టేది అనారోగ్యం. చాలామంది వారి భర్తల దగ్గర వారి యొక్క అనారోగ్య పరిస్థితి గురించి ఎక్కువశాతం చెప్పాలని అనుకోరు. ఓపిక తెచ్చుకొని మరీ పనులు చేస్తూ వారి పని వారే చేసుకోవాలని భావిస్తారు. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే తప్ప ఈ విషయాన్ని భర్తలకు చెప్పరు.
ప్రేమ : భార్యలకు చేసుకున్న భర్త పై చాలా వరకు ప్రేమ ఉంటుంది. అయితే ఈ విషయాలన్నీ నివృత్తి చేసుకోవడానికి పదే పదే భర్తపై ప్రేమను చూపించే స్త్రీలు చాలా తక్కువే. అయితే భార్య మనకు ఇలా ప్రేమ చూపిస్తుందో గ్రహిస్తూ భర్తలు నడుచుకోవాలి.
ధనం: అయితే కొంత మంది స్త్రీలు వారి యొక్క భర్తలు తెలియకుండా రహస్యంగా ధనాన్ని పోగు చేస్తూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో కాకపోయినా సరే అవసరానికి ఆదుకునే ల ధనాన్ని దాస్తారు. వీటిగురించి కూడా భర్తకి తెలియనివ్వరు. ఆ ధనాన్ని అలాగే ఖర్చు చేయకుండా ఉంచి ఏదైనా అవసరం వచ్చిన సమయంలో కుటుంబాన్ని ఆదుకుంటూ ఉంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి