పసుపు మంచి మెడిసిన్గా పనిచేయడమే కాకుండా ఎన్నో గుణాలను తనలో దాచుకొని ఉంది . ముఖ్యంగా పసుపులో ఉండే కర్కుమిన్ రక్తంలో చక్కర స్థాయిలను కూడా తగ్గిస్తుంది అని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఇకపోతే మధుమేహానికి సంబంధించిన అన్ని రకాల ప్రమాదాలను తగ్గించడంలో పసుపు చాలా బాగా సహాయపడుతుంది. నిజానికి హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అది కేవలం ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా.. మీ వంటకాలకు మంచి రుచిని అందిస్తుంది . అంతేకాదు వైవాహిక జీవితంలో ఒక మహిళకు పసుపు అనేది చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఆ పసుపులోనే తన సౌభాగ్యాలను వివాహిత చూసుకుంటుంది అని సమాచారం.

ఇక అంతే కాదు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు , పూజలు చేసినప్పుడు తప్పకుండా ఆడవారు కాళ్లకు , చేతులకు , ముఖానికి చక్కగా పసుపు పూసుకొని అమ్మవారి పూజలో నిమగ్నమవుతారు.ఇక పోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు.. రక్తం కారుతుంటే వెంటనే పసుపు పెట్టి ప్రథమ చికిత్స చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇక దగ్గు, జలుబు సమస్యలు ఉన్నప్పుడు కూడా పసుపును పాలలో వేసుకొని తాగితే యాంటీబయోటిక్ లా పనిచేస్తుందని చెప్పవచ్చు.

మరి ముఖ్యంగా పసుపుతో టీ తాయారు చేసుకుని తాగడం వల్ల అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఒక కప్పు పసుపు టీ తాగినట్లయితే ఎన్నో పోషకాలు లభిస్తాయి. పసుపుతో తయారు చేసిన టీ తాగడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి.. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు. ఇక అంతే కాదు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా పసుపు కలిగి ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో పసుపు మొదటి స్థానంలో ఉంటుంది. ఇక అంతే కాదు రొమ్ము , చర్మం, పేగు,  పొట్ట మొదలైన వాటి క్యాన్సర్లను కూడా పసుపు నివారిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: