కొన్ని కొన్ని సార్లు పుస్తకాల్లో ఉన్న కథలు నిజ జీవితంలో కూడా నిజం అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే అందరూ దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటిదే ఒకటి జరిగింది.  దాదాపు  చిన్నప్పుడు పుస్తకంలో ప్రతి ఒక్కరు కూడా కాకి స్టోరీ గురించి చదివే ఉంటారు. దాహంతో ఉన్న కాకి కుండలో ఉన్న నీళ్లు తాగాలని అనుకుంటుంది. కానీ ఆ నీళ్లు దానికి అందకపోవడంతో ఎలా ఆ నీళ్లను పైకి తీసుకురావాలా అని ఆలోచిస్తుంది. ఇలా ఆలోచించిన తర్వాతే పక్కనే ఉన్న కొన్ని రాళ్లను తీసుకొచ్చి ఆ కుండలో వేసి ఇక నీటిని పైకి వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత దాహం తీర్చుకుంటూ ఉంటుంది.



 ఇలా చురుకైన తెలివితేటలతో కాకి తన దాహాన్ని తీర్చుకున్న అద్వితీయ కథ చిన్నప్పుడు మనందరం చదువుకున్నదే. అయితే కాకి గురించి  కథ అటు పుస్తకాల్లో చదవడమె.. కానీ నిజజీవితంలో మాత్రం జరిగింది ఇప్పటివరకు దాదాపు ఎవరూ చూసి ఉండరు. కానీ ఇక్కడ మాత్రం అచ్చంగా పుస్తకాల్లో చదివిన కథ నిజం అయింది అని చెప్పాలి. గతంలో పుస్తకంలో చెప్పిన కథలో లాగానే ఇక్కడ ఆ కాకికి దాహం వేసింది. ఇక ఇంతలో ఆ కాకికి ఒక వాటర్ బాటిల్ కనిపించింది. దీంతో దాహం తీర్చుకునేందుకు ఎంతో ఆతృతగా బాటిల్ దగ్గరికి వెళ్ళింది.  కానీ ఏం లాభం బాటిల్లో ఉన్న సగం వరకు నీళ్లు అటు కాకికి అందలేదు. దీంతో పుస్తకంలో చెప్పినట్లుగానే ఇక్కడ ఆ కాకి చేసింది.



 పక్కనే ఉన్న గులకరాళ్లను ఒక్కొక్కటిగా అటు బాటిల్లో నింపడానికి ప్రయత్నిస్తుంది. చివరికి ఇలా గులకరాళ్ళను  అటు బాటిల్లో వేసి నీరు పైనకు వచ్చేలా చేసింది. ఇక ఆ తర్వాత దాహం తీర్చుకుంది అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు వరకు కాకి తెలివిగా దాహం తీర్చుకుంటుంది అని పుస్తకాల్లో చదవడం తప్ప ప్రత్యక్షంగా చూసింది మాత్రం ఇప్పుడే అని ఇది చూశాక ఎంతోమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి. నిజంగా కాకులు కూడా ఇంత తెలివిగా ఆలోచిస్తాయా అని అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: