స్ప్లీటెడ్ హెయిర్..
జుట్టు చివర్ల చిట్లడం వంటి వాటిని రిపేరు చేయడంలో విటమిన్ ఈ క్యాప్సిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనికోసం రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని,అందులో విటమిన్ ఈ క్యాప్సిల్ కలిపి మాడుకు బాగా మసాజ్ చేసుకోవాలి.ఇలా చేయడం ద్వారా జుట్టుకి మంచి పోషణ అంది,జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి.మరియు ముందుగా చిట్లిన హెయిర్ కూడా రిపేర్ అవుతుంది.
పొడిచర్మం పోగొట్టుకోవడానికి..
చాలామంది చర్మం పొడిపొడిగా ఉండి,పాలిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది.అలాంటి వారికి విటమిన్ ఈ క్యాప్సిల్ చాలా బాగా ఉపయోగపడతాయి.దీనికోసం రెండు టీ స్పూన్ల పాలల్లో విటమిన్ ఈ క్యాప్సిల్ వేసి బాగా కలిపి,ఆ పాలతో ముఖాన్ని తరచూ శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం పొడిబారడం తగ్గిపోతుంది.
స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి..
కడుపుతో ఉన్నవారికి డెలివరీ తర్వాత వారి పొట్టపై చారలు చారలుగా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతూ ఉంటాయి.అలాంటి స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి విటమిన్ ఈ ఆయిల్ తీసుకొని,మెల్లగా మర్దన చేసుకోవాలి.ఇలా ఒక నెలపాటు మర్దనా చేయడం వల్ల మెల్లమెల్లగా స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి.
చర్మంపై పొట్టును పోగొట్టుకోవడానికి..
కొంతమందికి వేళ్ళు,కాళ్ళు చర్మం పొట్టుపోట్టుగా లేచి పోతుంటుంది.అలాంటి వారు విటమిన్ ఈ క్యాప్సిల్ తో రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి,చేతులు,కాళ్లు మర్దన చేసుకోవడంతో చర్మంపై పొట్టుపోవడం తగ్గిపోతుంది.మరియు చర్మం హైడ్రెటెడ్ గా కూడా ఉంటుంది.
మొండి మచ్చలు పోగొట్టుకోవడానికి..
ముఖంపై సన్టాన్ మరియు మొటిమల వల్ల మొండిమచ్చలు తయారు అవుతూ ఉంటాయి.వీటిని పోగొట్టుకోవడానికి కూడా విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనికోసం విటమిన్ ఈ ఆయిల్ తో శనగపిండి కలిపి,ముఖం శుభ్రం చేసుకుంటే, ఎటువంటి మచ్చలనైనా తొందరగా పోగొట్టుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి