
ఈ సమస్యను మొదట్లోనే తుంచేస్తే చాలా మంచిది.లేకుంటే ఏమీ కాదులే అని వదిలేస్తే మాత్రం ఫ్యూచర్లో పిల్లలు కాకపోవడం,గర్భంలో నీటి బుడగలు, సి ఓ ఎస్ పి సి ఓ డి సమస్యలు రాయుడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా.ఇలాంటి పీరియడ్స్ రెగ్యులర్ చేసుకోవడానికి మనం సాధారణంగా తినే ఆహారాలే సక్రమంగా తీసుకోవడంతో మంచి ఉపశమనం కలుగుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. అలాంటి ఆహారాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
పసుపు,పాలు..
ఎవరైనా రుతుక్రమణ సమయంలో అధిక స్రావంతో బాధపడుతూ ఉంటే,అలాంటి వారు పసుపు పాలను తాగడం చాలా ఉత్తమం.ఇందులో ఉన్న ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు మరియు పాలల్లో ఉన్న కాల్షియం అధిక రక్తస్రావం కాకుండా అడ్డుపడుతుంది.
బీట్రూట్ జ్యూస్..
ఇరెగ్యులర్ పీరియడ్ తో బాధపడేవారు తరచూ బీట్రూట్ మరియు కొత్తిమీరతో చేసిన జ్యూస్ తాగడం వల్ల,ఇందులోని పోలిక్ యాసిడ్ మరియు కాల్షియం ఐరన్ పుష్కలంగా అంది,పీరియడ్స్ ని రెగ్యులర్ చేస్తాయి.
దాల్చిన చెక్కటి..
పీరియడ్ సమయంలో దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల,ఇందులోని పోలిక్ యాసిడ్ అధిక రక్తస్రావం కాకుండా మరియు ఆ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి,కాళ్ళ నొప్పులకు విరుగుడుగా పనిచేస్తుంది.
విటమిన్ సి ఉన్న ఆహారాలు..
విటమిన్ సి అధికంగా ఉన్న ఆరెంజ్,జామ,నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు.
పైనాపిల్..
ఇరెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడేవారు రుతుక్రమణ సమయం కంటే వారం ముందు నుంచే పైనాపిల్ తీసుకోవడం చాలా మంచిది.ఇందులోని బ్రోమాలైన్ అనే ఎంజైమ్ పీరియడ్స్ ని రెగ్యులర్ చేయడంలో సహాయపడుతుంది.కావున ఇటువంటి సమస్యలు ఎవరైనా బాధపడుతూ ఉంటే పైన చెప్పిన ఆహారాలన్నీ తీసుకోవడం వల్ల,పీరియడ్ సమస్యను తొందరగా నివారించుకోవచ్చు.